BigTV English

Bigg Boss Manikanta: మా మధ్య గొడవలు లేవు, నా వల్లే ఇలా జరిగింది.. భార్యతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మణికంఠ

Bigg Boss Manikanta: మా మధ్య గొడవలు లేవు, నా వల్లే ఇలా జరిగింది.. భార్యతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మణికంఠ

Bigg Boss Manikanta: బిగ్ బాస్ సీజన్ 8లో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కేటగిరిలో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు నాగ మణికంఠ. తను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, రీల్స్ చేసినా.. తన గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. మిగతావారితో పోలిస్తే ఆడియన్స్‌లో మణికంఠను గుర్తుపట్టేవారు చాలా తక్కువ. కానీ తన పర్సనల్ లైఫ్‌ గురించి షేర్ చేసుకొని ఎమోషనల్ అవ్వడంతో కొందరు ఆడియన్స్ తనకు కనెక్ట్ అయ్యారు. తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు అనే సింపథీతో ప్రేక్షకుల ఓట్లు కూడా పడ్డాయి. తాజాగా బిగ్ బాస్ నుండి స్వయంగా తప్పుకొని బయటికి వచ్చేసిన మణికంఠ.. అసలు తన భార్యతో విభేదాలు ఎందుకు వచ్చాయో బయటపెట్టాడు.


అప్పటికీ అదే పరిస్థితి

నాగమణికంఠకు పెళ్లయ్యి.. ఒక పాప కూడా ఉందనే విషయాన్ని బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన మొదటిరోజే బయటపెట్టేశాడు. తన భార్య, పాప తనకు కావాలని చాలాసార్లు ఏడ్చాడు. కానీ వారి మధ్య అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భార్యతో విభేదాలు ఎందుకు వచ్చాయో వివరించాడు మణి. ‘‘మా మధ్య గొడవలు ఏమీ జరగలేదు. నేను అమెరికాకు వెళ్లిన తర్వాత ఉద్యోగం చేయవచ్చని అనుకున్నాను. కానీ అక్కడ వీసా లేట్ అయ్యింది. రెండేళ్లు అయిపోయింది. పాప కూడా పుట్టేసింది. పాప పుట్టాక ముందు వీసా రాకుండా ఇంట్లో ఉండడం వేరు కానీ తను పుట్టిన తర్వాత కూడా నాకు వీసా రాలేదు. వీసా ఎప్పుడు అని నా భార్యను ప్రెజర్ పెట్టేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు మణికంఠ.


Also Read: ఏంటీ, నాగమణికంఠ మగాడు కాదా.. విస్తుపోయే నిజం..!

గ్యాప్ వచ్చేసింది

‘‘వీసా విషయంలో నా భార్య చేతిలో కూడా ఏం లేదు. ఎంబెసీలోనే టైమ్ పడుతుంది. తను పాపను చూసుకుంటూ వర్క్ చేసుకుంటున్నప్పుడే నా వీసా ఎక్కడ అని సతాయించేవాడిని. తను ఇదంతా చూసి.. రెండేళ్లు పనిచేయకుండా ఉండడం మామూలు మాట కాదు, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నావు, ఇండియాకు వెళ్లి పనిచేసుకో వీసా రాగానే పిలుస్తా అని చెప్పింది. ఇండియాకు వచ్చేసిన తర్వాత నేను ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ.. తను అక్కడ పాపను చూసుకుంటూ ఉండడంతో మా మధ్య గ్యాప్ వచ్చేసింది. టైమ్ జోన్ వేరు అయినా అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుతుంటూ వెంటనే వీసా గురించి అడిగేవాడిని. తనకు అది చిరాకు వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నాడు మణికంఠ.

రోజూ మాట్లాడుకునేవాళ్లం

‘‘తను ప్రేమగా మాట్లాడదామని ఫోన్ చేసినా నేను వీసా వచ్చిందా అని అడిగేవాడిని. అలా తను స్పేస్ ఇవ్వడం మొదలుపెట్టింది. తనతో మాట్లాడి 9 నెలలు అయిపోయింది. ఒకప్పుడు రోజూ మాట్లాడుకునేవాళ్లం. బిగ్ బాస్ ద్వారా నేను సంపాదిస్తూ ఆటోమేటిక్‌గా నాకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాపకు నేను కూడా స్కూల్ ఫీజ్ కట్టగలను అనిపిస్తుంది’’ అని బిగ్ బాస్ షో వల్ల వచ్చిన మార్పుల గురించి తెలిపాడు మణికంఠ. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్షకులు తనకు ఓట్లు వేసి గెలిపించినా మణికంఠ మాత్రం తనవల్ల కాదంటూ షో నుండి స్వయంగా తప్పుకున్నాడు. కానీ ప్రేక్షకుల్లో మాత్రం బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Related News

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Big Stories

×