Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధమయ్యింది. అయితే మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్‌లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి బిగ్ బాస్ షాకిచ్చారు. ఆ వైల్డ్ కార్ట్ ఎంట్రీస్ హౌస్‌లోకి రాకుండా ఉండాలంటే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ టాస్కులు ఆడాలి, గెలవాలి. గతవారం కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ను హౌస్‌లోకి రాకుండా ఆపారు హౌస్‌మేట్స్. ఈవారం కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్కుల కోసం కంటెస్టెంట్స్ అంతా సిద్ధమయ్యారు. ఇందులో సీతకు ఊహించని షాక్ తగిలింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
రోల్ బేబీ రోల్
‘‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మరో టాస్క్.. రోల్ బేబీ రోల్’’ అంటూ బిగ్ బాస్ వివరించడంతో ప్రోమో మొదలవుతుంది. ఈ టాస్క్‌లో కదులుతున్న ప్లాట్‌ఫార్మ్ నుండి బాల్స్ విసిరి అవతల వైపు ఉన్న పాయింట్స్ బ్యాగ్స్‌లో పడేలా చేయాలి. చివరికి వారు వేసిన బాల్స్‌ను బట్టి ఆ పాయింట్స్ కౌంట్ చేస్తారు. ఈ టాస్క్ ఆడడం కోసం శక్తి టీమ్ నుండి ఆదిత్య ఓం, కాంతార టీమ్ నుండి నబీల్ రంగంలోకి దిగారు. మణికంఠ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇందులో ఏ టీమ్ గెలిచింది అనే విషయాన్ని ప్రోమోలో చూపించకపోయినా కాంతార టీమ్ నుండి ఒకరి సభ్యుడిని తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చారు బిగ్ బాస్.
Also Read: జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావ్.. నరాలు బిగబట్టిన ఆడియన్స్..!
ఒక్క టాస్క్ ఆడలేదు
కాంతార టీమ్ నుండి ఒక సభ్యుడిని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌ల నుండి దూరం చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎవరిని తీసేస్తే బాగుంటుంది అని నిఖిల్ టీమ్ చర్చలు మొదలుపెట్టింది. తమ టీమ్ నుండి ఎవరు వెళ్లిపోయే ఛాన్స్ ఉందని సీత టీమ్ కూడా చర్చించుకుంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో ఇప్పటివరకు ఒక్క టాస్క్‌లో కూడా పాల్గొనలేదు నైనికా. దీంతో నైనికాను తీసేసే ఛాన్స్ ఉందని మణికంఠ అన్నాడు. కానీ సీత.. తాను ఒక్క టాస్క్‌లో కూడా ఆడలేదని గుర్తుచేసింది. సీత లేదా విష్ణుప్రియాను తీసేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది యష్మీ. ఫైనల్‌గా సీతను తప్పించాలని నిర్ణయించుకుంది నిఖిల్ టీమ్.
సీత అనర్హురాలు
సీతను సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి సీతనే అనర్హురాలు అని నిఖిల్ చెప్పగా బిగ్ బాస్ కూడా దానికి అంగీకరించారు. అప్పుడు తను ఏమీ మాట్లాడకపోయినా.. ఆ తర్వాత మాత్రం ఒక్క టాస్క్ అయినా ఆడాల్సింది అంటూ ఏడ్చేసింది. ‘‘సీతను తీసేస్తామని ఊహించలేదనుకుంటా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యారు’’ అని పృథ్వి, నిఖిల్‌తో చెప్పింది యష్మీ. ‘‘గతవారంలో సీతకు ఆడే ఛాన్స్ ఉన్నా నబీల్‌నే పంపించింది’’ అంటూ సీత చేసిన తప్పును ఎత్తిచూపాడు నిఖిల్. ‘‘మొత్తంగా ఫేవరెటిజం చూపిస్తున్నారు. బయట ఆలోచించిందంతా గుర్తుపెట్టుకొని వస్తే ఇక్కడ ఇంక ఆడి ఏం లాభం’’ అంటూ టాస్కుల నుండి తనను తొలగించినందుకు ఫీల్ అయ్యింది సీత.