BigTV English

Rajinikanth: తలైవా.. ఇక సినిమాలకు దూరమైతే మంచిదేమో..

Rajinikanth: తలైవా.. ఇక సినిమాలకు దూరమైతే  మంచిదేమో..

Rajinikanth: సూపర్ స్టార్  రజినీకాంత్.. ఈ పేరు ఒక బ్రాండ్.  ఆయన గురించి సినిమా ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక బస్ కండక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. నేడు కొన్ని వేల  కోట్లకు అధిపతిగా మారిన ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఎన్ని కోట్లు ఉన్నా కూడా రజినీ ఏరోజు కూడా డబ్బు కోసం ఆశపడలేదు. గర్వం చూపించలేదు. ఒక సాధారణ బస్సు కండక్టర్ గానే జీవితం గడుపుతూ వస్తున్నాడు.


సాధారణంగా ఏ రంగంలోనైనా ఒక లిమిట్ వరకే పనిచేస్తారు. ఆ తరువాత రిటైర్ మెంట్ తీసుకుంటారు. కానీ అసలు రిటైర్ మెంట్ లేని ఫీల్డ్ అంటే ఇండస్ట్రీ అనే చెప్పాలి.  చనిపోయేంతవరకు కూడా పనిచేసిన నటులు చాలామందే ఉన్నారు. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరావును తీసుకుంటే.. ఆయన క్యాన్సర్ తో చనిపోతూ కూడా మనం సినిమాలో నటించారు. ఇలా ఎంతోమంది నటులు  సినిమాలు చేస్తూనే తమ తుదిశ్వాసను విడిచారు. దీంతో  చాలామంది అభిమానులు సీనియర్ నటులకు అభిమానులు ఒకటే చెప్పుకొస్తున్నారు. ఒక ఏజ్ వచ్చాక సినిమాలకు దూరమై రెస్ట్ తీసుకోవాలని చెప్పుకొస్తున్నారు.

ఇకపోతే కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్  కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ను రెస్ట్ తీసుకోమని చెప్పుకొస్తుంది. ప్రస్తుతం రజినీ వయస్సు 73.  ఈ వయస్సులో కూడా అయన వరుస సినిమాలు చేస్తున్నాడు. గత కొన్ని నెలల క్రితమే రజినీ ఆరోగ్యం క్షీణించిన విషయం తెల్సిందే. అప్పుడు కూడా అభిమానులు ఎంతో ఆందోళన పడ్డారు. దేవుడి దయవలన రజినీ ఆరోగ్యంతో ఇంటికి తిరిగివచ్చారు. ఆ తరువాత రజినీ నుంచి లాల్ సలామ్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందింవ్వలేకపోయింది.


ఇక ఆరోగ్యం బాగోలేనప్పుడే  రజినీ.. వెట్టయాన్, కూలీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వెట్టయాన్ షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. కూలీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సమయంలోనే  రజినీ మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. సోమవారం అర్ధరాత్రి రజినీకి కడుపునొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెల్సిందే. ఇక రజినీకాంత్ కు రక్తనాళాల్లో ఇబ్బంది ఉందని గుర్తించిన వైద్యులు ఆయనకు ఎలక్టీవ్ ప్రొసీజర్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో రజినీ ఆరోగ్య విషయంలో అభిమానులు చాలా ఆందోళన పడుతున్నారు.

ఇకనుంచి అయినా సినిమాలు మానేసి రెస్ట్ తీసుకుంటే మంచిదని చెప్పుకొస్తున్నారు. ఈ వయస్సులో వరుస సినిమాలు, షూటింగ్స్ అంటే ఆయన ఆరోగ్యం సహకరించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యం మీద దృష్టి పెడితే బావుంటుందని సలహాలు ఇస్తున్నారు. రజినీ నుంచి వచ్చే సినిమాల కన్నా ఆయన ఆరోగ్యమే తమకు ముఖ్యమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కూలీ తరువాత రజినీ ఎలాంటి సినిమాను ఒప్పుకోవద్దని అంటున్నారు.

ఇక ఇంకోపక్క రజినీ ఆరోగ్యంగా ఇంటికి రావాలని అభిమానులు పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు రజినీ సినిమాలకు దూరమై ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాడా.. లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×