BigTV English

Bigg Boss 8 Day30. Promo 2: జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావ్.. నరాలు బిగబట్టిన ఆడియన్స్..!

Bigg Boss 8 Day30. Promo 2: జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావ్.. నరాలు బిగబట్టిన ఆడియన్స్..!

Bigg Boss 8 Day 30 Promo 2.. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఆపే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు కంటెస్టెంట్స్. ఎవరికివారు ఛాలెంజ్ స్వీకరించి ఎలాగైనా సరే వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపాలని తెగ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు, అవాంతరాలు, గొడవలు, ప్రేమలు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ నేపథ్యంలోనే మరొక ఛాలెంజ్ తో కంటెస్టెంట్స్ ని ఇరుకున పెట్టేసారు బిగ్ బాస్ . ఇక బిగ్ బాస్ పెట్టిన ఈ ఛాలెంజ్ కి కంటెస్టెంట్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా నరాలు బిగబట్టి మరీ ఆ గేమ్ చూశారని చెప్పాలి . 30వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసింది స్టార్ మా.


ప్రేరణ వర్సెస్ మణికంఠ..

ప్రోమో విషయానికి వస్తే.. జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావ్ అనే ఛాలెంజ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసారు బిగ్ బాస్. శక్తి క్లాన్, కాంతారా క్లాన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపే ప్రయత్నం చేస్తుండగా.. అందులో భాగంగానే కాంతారా టీమ్ అంతా ఒకే చోట చేరారు. అందులో నైనిక మాట్లాడుతూ.. మనలో ఇప్పుడు నలుగురు నామినేషన్ లోకి వచ్చారు కాబట్టి ఆ నలుగురికి కాకుండా మిగిలిన మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నెక్స్ట్ చాలెంజ్ కు పోవాలని నా ఉద్దేశం అంటూ నైనిక చెబుతుంది. అయితే వెంటనే మణికంఠ మాట్లాడుతూ.. తను హెల్త్ లో వీక్ గా ఉంది కదా.. అని చెబుతుండగానే ప్రేరణ కోప్పడుతూ నువ్వు నా హెల్త్ గురించి మాట్లాడకు అంటూ మణికంఠ పై ఫైర్ అయ్యింది. నా హెల్త్ గురించి నేను చూసుకుంటాను, నువ్వు దాని గురించి మాట్లాడకు అని ప్రేరణ చెబుతుంటే, మధ్యలో మణికంఠ కలుగజేసుకున్నారు. దీనికి ప్రేరణ ఆ పాయింట్ లేకుండా నామినేషన్ చెప్పు అంటూ చెబుతుంది.


నబీల్ కి సపోర్ట్ గా నిలిచిన విష్ణు ప్రియ..

నబీల్ మాట్లాడుతూ.. ఒక విధంగా చీఫ్ సీతకి ఇమ్యూనిటీ ఒక వారం ఉంది కాబట్టి సీతా వెళితే బెటర్ అని నేను కూడా అనుకుంటున్నాను అంటూ నబీల్ చెబుతాడు. నబీల్ తో మాట్లాడిన తర్వాత నాకు కూడా అవును అది కరెక్ట్ పాయింట్ అనిపించింది అంటూ దీర్గిస్తూ చెబుతుంది విష్ణు ప్రియ. ఇక సీత మాత్రం దీనికి ఒప్పుకోదు.

జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావ్..

ఇక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో భాగంగా జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతావు అంటూ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక సీత అక్కడ నో చెప్పడంతో మణికంఠ మరియు యష్మీ గేమ్ ఆడడానికి ముందుకు వచ్చారు. ఒక కట్టిని బ్యాలెన్స్ చేస్తూ.. జాగ్రత్తగా నడుస్తూ.. బాల్స్ వేస్తూ కంటెస్టెంట్స్ బాగా కష్టపడ్డారని చెప్పాలి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఆడుతున్నంతసేపు నరాలు బిగబట్టి ఆడియన్స్ కూడా ప్రోమో చూశారని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇక్కడ యష్మీ విన్ అయినట్టు తెలుస్తోంది. ఇక పూర్తి ఎపిసోడ్ రావాలి అంటే రాత్రి వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్9లోకి ఓజీ నటుడు.. వర్కౌట్ అయితే ఇరకాటంలో నాగ్!

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Big Stories

×