BigTV English

Bigg Boss 8 Telugu Promo: తల్లి కోసం తేజ కన్నీళ్లు, రోహిణికి స్వీట్ సర్‌ప్రైజ్.. హౌస్‌లో బుడ్డోడి రచ్చ

Bigg Boss 8 Telugu Promo: తల్లి కోసం తేజ కన్నీళ్లు, రోహిణికి స్వీట్ సర్‌ప్రైజ్.. హౌస్‌లో బుడ్డోడి రచ్చ

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అంటే టాప్ 10 కంటెస్టెంట్స్ మధ్య ఇప్పుడు పోటీ ప్రారంభం కానుంది. అందుకే పోటీ మరింత బలంగా మొదలయ్యే ముందు ఫ్యామిలీ వీక్‌తో అందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు బిగ్ బాస్. మంగళవారం నుండే ఫ్యామిలీ వీక్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు తాజాగా బయటికొచ్చాయి. మొదటిరోజు నబీల్ తల్లి, రోహిణి తల్లితో పాటు తన మేనల్లుడు.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినట్టు ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. అయితే అందరి ఫ్యామిలీస్‌ను చూస్తూ తన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి రాలేకపోతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు టేస్టీ తేజ.


అమ్మకు నచ్చదు

‘‘అందరి పేరెంట్స్ వస్తారు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు. కానీ అమ్మ కోసం ఏడుస్తానని అనుకోలేదు. ప్లీజ్ బిగ్ బాస్’’ అంటూ ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు టేస్టీ తేజ. ఆ తర్వాత మెల్లగా కన్ఫెషన్ రూమ్‌లో నుండి రోహిణి మేనల్లుడు నడుచుకుంటూ వచ్చాడు. అందరూ తన చుట్టూ చేరి తనను ఎత్తుకున్నారు. తనను చేతుల్లోకి తీసుకున్న రోహిణి.. నాన్నమ్మ ఏది అంటూ తన తల్లి గురించి అడగగా.. వస్తుంది అంటూ క్యూట్‌గా సమాధానమిచ్చాడు. గేట్ నుండి తన తల్లి లోపలికి రాగానే వెంటనే తనను వెళ్లి హత్తుకుంది రోహిణి. ‘‘మా అమ్మ చాలా యంగ్. నేనే మా అమ్మకంటే పెద్దదానిలాగా ఉంటాను’’ అంటూ కామెడీ మొదలుపెట్టేసింది.


Also Read: డేంజర్ జోన్ లో టైటిల్ ఫేవరేట్.. ఎలిమినేషన్ తప్పదా..?

విష్ణుప్రియా ఎమోషనల్

హౌస్‌లోకి రాగానే ముందుగా వెళ్లి విష్ణుప్రియాను దగ్గరకు తీసుకున్నారు రోహిణి తల్లి. ‘‘అమ్మ లేదని ఫీల్ అవ్వద్దు. నీకు మేము అందరం ఉన్నాం. నేను మీ అమ్మను అనుకో’’ అని చెప్పగానే విష్ణు ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి బుడ్డోడితో ఆటలు మొదలుపెట్టారు. ‘‘నేను బాగున్నానా’’ అని తేజ తనను అడగగానే ‘‘బాలేవు’’ అని మొహం మీద చెప్పాడు ఆ బాబు. దీంతో అందరూ నవ్వారు. కాసేపు నిఖిల్ కూడా ఆ బాబుతో కబుర్లు చెప్పాడు. అవినాష్ వచ్చి తనతో కామెడీ చేశాడు. టేస్టీ తేజ ఏమో తనను మావయ్య అని పిలవమంటూ అందరినీ నవ్వించాడు. అలా ఫ్యామిలీ వీక్ అంతా సందడిగా సాగిపోనుంది.

మిస్ అవుతాను

ఇప్పటివరకు విడుదలయిన మరో ప్రోమోలో నబీల్ తల్లి హౌస్‌లోకి వచ్చారు. ముందుగా నబీల్ తల్లితోనే ఈ ఫ్యామిలీ వీక్ ప్రారంభమయ్యింది. ఎలాగైనా కప్ తనే గెలవాలని ధైర్యం చెప్పి మరీ వెళ్లారు. ఇప్పటివరకు తను ఏమీ అనిపించలేదని, ఇప్పటినుండి అందరినీ ఎక్కువగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుందని నబీల్ బాధపడ్డాడు. గతవారం కంటెస్టెంట్స్‌లో చాలామంది తేజ వరస్ట్ ప్లేయర్ అని చెప్పడంతో ఫ్యామిలీ వీక్ కోసం తన తల్లి హౌస్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం పోయిందని నాగార్జున ప్రకటించారు. అప్పటినుండి తేజ ఈ విషయంలో బాధపడుతూ, కంటెస్టెంట్స్‌ను దూరం పెడుతూనే ఉన్నాడు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×