BigTV English
Advertisement

Vande Bharat Express – Pakistan’s Green Line: వందే భారత్ VS పాకిస్తాన్ గ్రీన్ లైన్, వీటిలో ఏ రైలు తోప్ అంటే?

Vande Bharat Express – Pakistan’s Green Line: వందే భారత్ VS పాకిస్తాన్ గ్రీన్ లైన్, వీటిలో ఏ రైలు తోప్ అంటే?

భారతీయ రైల్వేలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. రోజూ కోట్లాది మంది ప్రజలను సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలకు చేపట్టిన తర్వాత భారతీయ రైల్వేలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడంతో పాటు హై స్పీడ్ రైళ్లు విస్తరిస్తున్నాయి. 2019లో ప్రధాని మోడీ తొలి స్వదేశా సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ను ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


వందేభారత్ Vs గ్రీన్ లైన్ ఎక్స్‌ ప్రెస్

మోడీ ప్రభుత్వం 2047 నాటికి 4,500 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. సెకెండ్ జనరేషన్ వందే భారత్ రైళ్లను సెప్టెంబర్ 2022లో అందుబాటులోకి తీసుకొచ్చారు. జనవరి 2024 నాటికి దేశ వ్యాప్తంగా 82 వందే భారత్ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్ లో ‘గ్రీన్ లైన్ ఎక్స్‌ ప్రెస్’ అనే ప్రీమియం రైలు తన సేవలను కొనసాగిస్తున్నది. ఇది ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుంది. అత్యధిక  ప్రమాణాలు, మంచి సౌకర్యాల కారణంగా,  వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లతో పోల్చుతున్నారు. ఇంతకీ ఈ రెండు రైళ్లలో ఏది గొప్ప రైలో ఇప్పుడు తెలుసుకుందాం..


గ్రీన్ లైన్ రైలు ఫీచర్లు, ధర

⦿ గ్రీన్ లైన్ రైలు పాకిస్థాన్‌ లో అత్యంత వేగవంతమైన,  అత్యంత విలాసవంతమైన రైలు. ఈ రైలు కరాచీ కాంట్ నుంచి ఇస్లామాబాద్ రూట్లలో నడుస్తుంది.

⦿ ఈ రైలు 2015లో పాకిస్తాన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

⦿ ఈ లగ్జరీ రైలు కరాచీ నుంచి ఇస్లామాబాద్ వరకు (సుమారు 1500 కి.మీ)  22 గంటల్లో పూర్తి చేస్తుంది.

⦿ పాకిస్తాన్ ప్రీమియం రైలులో లగ్జరీ బస్సు రూపాన్ని పోలి ఉండే AC పార్లర్ క్లాస్ ఉంటుంది.

⦿ రెండు పార్లర్ కార్లు, ఐదు బిజినెస్ కోచ్‌లు, ఆరు AC స్టాండర్డ్ కోచ్‌లు ఈ రైలులో టాప్ ఫీచర్లు.

⦿ రైలు గరిష్ట వేగం గంటకు 105 కిలో మీటర్లు. సగటున గంటకు 72 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

⦿ ప్రయాణీకులకు ఇందులో Wi-Fi, ఆన్‌ బోర్డ్ వినోదం, కాంప్లిమెంటరీ భోజనాలు, యుటిలిటీ కిట్లు సహా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది.

⦿ కరాచీ కాంట్ నుంచి ఇస్లామాబాద్ టిక్కెట్ ధరలు.. ఎకానమీ క్లాస్ రూ. 2,200. బెర్త్-ఎకానమీ రూ. 2,300.  బిజినెస్ క్లాస్ రూ. 6,650.

వందే భారత్ ఫీచర్లు, ధరలు

⦿ ప్రస్తుతం భారత్ లో సుమారు 100 రైళ్లు ఆయా రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తున్నాయి.

⦿ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ బ్రాడ్ గేజ్ (బి.జి.) ఎలక్ట్రిఫైడ్ నెట్‌ వర్క్‌ లో నడుస్తుంది.

⦿ వందే భారత్ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా, పాకిస్థాన్ గ్రీన్ లైన్ రైలు గరిష్ట వేగం గంటకు 105 కిలో మీటర్లు.

⦿ వందే భారత్‌లో ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్, హాట్ కేస్, వాటర్ కూలర్, డీప్ ఫ్రీజర్, హాట్ వాటర్ బాయిలర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ప్లగ్ డోర్స్ ప్యాంట్రీ ఉన్నాయి.

⦿ ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ కిటికీలు, అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ అలారం పుష్ బటన్, అన్ని కోచ్‌లలో టాక్ బ్యాక్ యూనిట్లు ఉన్నాయి.

⦿ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,565 కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ ధర రూ.2,825.

Read Also: రైలు కూతలో ఇన్ని రకాలున్నాయా? ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×