BigTV English

BB Telugu 8: డేంజర్ జోన్ లో టైటిల్ ఫేవరేట్.. ఎలిమినేషన్ తప్పదా..?

BB Telugu 8: డేంజర్ జోన్ లో టైటిల్ ఫేవరేట్.. ఎలిమినేషన్ తప్పదా..?

BB Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 11వ వారంలోకి అడుగు పెట్టింది. మరో నెల రోజుల్లో ఈ సీజన్ కాస్త పూర్తి కాబోతోంది. ఇకపోతే గత వారం గంగవ్వ ఎలిమినేట్ కాకుండానే షో కి గుడ్ బై చెప్పేసి,అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక చివరిగా హరితేజ కూడా పదవ వారం ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. గంగవ్వ , హరితేజ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో మొత్తం పదిమంది కంటెస్టెంట్స్ మిగిలారు. అందులో కన్నడ బ్యాచ్ ,తెలుగు బ్యాచ్ అన్నట్టుగా రెండు గ్రూపులుగా విడిపోయి, కంటెస్టెంట్స్ టైటిల్ కోసం భారీగా పోటీ పడుతున్నారు.


ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి యష్మీ, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణు ప్రియ, ముక్కు అవినాష్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఒకరు వచ్చేవారం కచ్చితంగా ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్ లో అనూహ్య ఫలితాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. గత వారం లాగే ఈ వారం కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించికున్న గౌతమ్ 25% ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఇక గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించకున్న గౌతమ్ అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఇప్పుడు మళ్లీ హౌస్ లోకి వచ్చి అందర్నీ వెనక్కి నెట్టి ఓటింగ్లో దూసుకుపోతున్నారు.

గౌతమ్ తర్వాత స్థానంలో యష్మీ నిలిచింది. 20 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. ఆట పరంగా ఆకట్టుకుంటున్న ఈమెకు, ప్రేక్షకులు బాగానే ఓట్లు వేస్తున్నారు. అందులోనూ ఈమె మొదటి రోజు నుంచి హౌస్ లోనే కొనసాగుతోంది. వీరిద్దరి తర్వాత మూడవ స్థానంలో పృథ్వీ నిలిచారు. నాలుగో స్థానంలో టేస్టీ తేజ.. చివరి రెండు స్థానాలలో విష్ణుప్రియ, అవినాష్ నిలిచారు. నిజానికి విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా పరిచయమైన 14 మంది కంటెస్టెంట్స్ లో కూడా విష్ణు ప్రియ టాప్ సెలబ్రిటీ. ముఖ్యంగా ఈమెకు ఉన్న గుర్తింపు అక్కడ వారికి లేదు. ఆ హోదాను నిలబెట్టుకోవడంలో ఈమె ఫెయిల్ అయ్యింది. తన దృష్టిని ఆటపై కంటే పృధ్వీరాజ్ పైనే ఎక్కువగా పెట్టి విమర్శలు ఎదుర్కొంది.


ముఖ్యంగా అతడు ఈమెను ఇష్టపడకపోయినా.. అతడి వెంటే తిరుగుతూ ఉన్న గుర్తింపును కాస్త పాడుచేసుకుంది. మొత్తానికైతే ఈవారం డేంజర్ జోన్ లో పడిపోయింది. ఇక వచ్చిన బంగారు అవకాశాన్ని అతడి కోసం కోల్పోయి టైటిల్ ని కొట్టే ఛాన్స్ కూడా కోల్పోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వారం తన ఆటను మెరుగుపరచుకోకపోతే విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×