Viral News: జ్యూస్ తాగిన ఓ మహిళ ఏకంగా కోటీశ్వరురాలైంది. అయితే ఇందులో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏమిటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుందని అంటారు పెద్దలు. కానీ ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు, ఇక లైఫ్ లో వెనుకడుగు ఉండదు.
కొందరికి ఆ అదృష్టం ఎప్పుడు వరిస్తుందో కూడా చెప్పలేం. దానికి సమయం, సంధర్భం కూడా ఉండాలంటారు అదృష్టవంతులు. సేమ్ టు సేమ్ ఒక మహిళకు ఆ అదృష్టం తలుపు తట్టింది. ఒక్కసారిగా కోటీశ్వరురాలిగా మారింది. ఇదెక్కడ జరిగిందంటే అమెరికాలో…
నార్త్ కరోలినాలోని కెర్నర్స్ విల్లేలో కిల్లీ స్పార్ అనే మహిళ నివసిస్తోంది. ఈమెకు రోజూ జ్యూస్ త్రాగే అలవాటు ఉంది. అది కూడా ఆరెంజ్ జ్యూస్ అంటే ఈమెకు అమిత ఇష్టం. ఆ ఆరెంజ్ జ్యూస్ ఈమెకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టింది. స్పార్ రోజు మాదిరిగానే ఇటీవల ఆరెంజ్ జ్యూస్ త్రాగేందుకు వెళ్లింది. అలా త్రాగుతున్న క్రమంలో తన చూపు ప్రక్కకు వెళ్లింది.
అది కూడా ప్రక్కన ఉన్న గ్యాస్ స్టేషన్ లోని లాటరీ టికెట్లపై చూపు పడింది. ఏదిఏమైనా కానీ టికెట్ కొనుగోలు చేయాలని భావించి, 20 డాలర్లతో ఒక టికెట్ ను తీసుకొంది. వెంటనే టికెట్ ను స్క్రాచ్ చేసి ఎగిరి గంతేసింది కిల్లీ స్పార్. అందులో ఏముందో తెలుసా.. టాప్ ప్రైజ్ విన్నర్ అని రాసి ఉండగా, ఏకంగా ఆమెకు రూ. 2,50,000 డాలర్లు దక్కాయి.
అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ. 2.10 కోట్లు. చూశారా.. అదృష్టం తలుపు తట్టినప్పుడు వెల్ కమ్ చెప్పాలి.. లేకుంటే చాలా మిస్ అవుతాము. కేవలం జ్యూస్ త్రాగేందుకు వెళ్లిన ఈ అమెరికా మహిళ.. ఒక్క టెస్ట్ రాసి లైఫ్ లో పాస్ అయిందిగా. కోట్లు దక్కించుకున్న ఈ మహిళను లక్కీ ఉమెన్ అనేస్తున్నారట తోటి మహిళలు.