BigTV English

Bigg Boss 8 Telugu Promo: పృథ్వీ.. ఏమో అనుకున్నాం కానీ, భలే కన్నింగ్‌గాడిలా ఉన్నాడే!

Bigg Boss 8 Telugu Promo: పృథ్వీ.. ఏమో అనుకున్నాం కానీ, భలే కన్నింగ్‌గాడిలా ఉన్నాడే!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో చీఫ్స్ అయిన యష్మీ, నైనికా టీమ్స్ మధ్య గట్టి పోటీ జరుగుతోంది. ఇప్పటికే ప్రసారమయిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో యష్మీ టీమ్ టాస్కుల్లో గెలిచి ముందంజలో ఉంది. అందుకే నైనికా టీమ్ కూడా వారికి గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా గోల్ గేమ్‌లో యష్మీ టీమ్ గెలిచింది. ఆ తర్వాత ఇరు టీమ్స్ హుప్స్ గేమ్‌లో పోటీపడినట్టుగా తాజాగా విడుదలయిన ప్రోమోలో చూపించారు. ఇక వీరి మధ్య జరుగుతున్న పోటీకి సంబంధించి మరొక ప్రోమో విడుదలయ్యింది. అందుకే ఇరు టీమ్ సభ్యులు విచక్షణ కోల్పోయి.. వారు గెలవడం కోసం కాకుండా అవతల టీమ్‌ను ఓడించడం కోసం ఆటను మొదలుపెట్టారు.


చివరి పోటీ

‘‘నైనికా, యష్మీ.. మీ ఇరు క్లాన్స్ వెబ్‌కు మధ్యలో ఉన్న ప్లాట్‌ఫార్మ్ మీద ఎక్కువ రాళ్లను నిటారుగా నిలబెట్టాల్సి ఉంటుంది’’ అంటూ టాస్క్ రూల్స్‌ను హౌజ్‌మేట్స్‌కు వివరించారు బిగ్ బాస్. యష్మీ, నైనికా టీమ్స్ మధ్య జరిగే చివరి పోటీ ఇదే అని, ఇందులో గెలిచినవారు నిఖిల్ టీమ్ నుండి ఒక కంటెస్టెంట్‌ను తమ టీమ్‌లోకి తీసుకోవచ్చని తెలిపారు. ఆ తర్వాత ఇరు టీమ్స్ మధ్య పోటీ మొదలయ్యింది. బిగ్ బాస్ ఏర్పాటు చేసిన వెబ్.. ఊయలలాగా ఊగుతూ ఉండడంతో.. దాంతో పాటు దానిపై ఉన్న ప్లాట్‌ఫార్మ్ కూడా ఊగుతుంది. అందుకే ఆ వెబ్‌లో కంటెస్టెంట్స్ అడుగుపెట్టగానే ప్లాట్‌ఫార్మ్ ఊగి దానిపై నిలబెట్టిన రాళ్లు పడిపోవడం మొదలయ్యింది. అలా ముందుగా యష్మీ వల్ల తన టీమ్‌మేట్స్ ప్లాట్‌ఫార్మ్‌పై నిలబెట్టిన మూడు రాళ్లు కిందపడిపోయాయి.


Also Read: నిఖిల్, యష్మి మధ్య ‘బాడీ’ గొడవ.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టిన నైనికా, ఆటలో అరటిపండులా సంచాలక్!

సీత వర్సెస్ అభయ్

టాస్క్ మధ్యలో ముందుగా యష్మీ టీమ్‌లోని పృథ్విరాజ్ వెళ్లి నైనికా టీమ్‌ నిలబెట్టిన రాళ్లను కిందపడేశాడు. దీంతో సంచాలకుడిగా ఉండాల్సిన నిఖిల్ కూడా ఆట న్యాయంగా ఆడడం లేదని, మీరు మీరు చూసుకోండి అంటూ పక్కకు తప్పుకున్నాడు. తర్వాత నబీల్, అభయ్ కూడా అలాగే రాళ్లను పడేశారు. అలా రూల్స్‌ను ఫాలో అవ్వకుండా యష్మీ, నైనికా టీమ్స్ పోటీపడ్డాయి. టాస్కుల మధ్యలో కిచెన్ డిపార్ట్‌మెంట్‌పై పనుల విషయంలో ఒత్తిడి పడడం మొదలయ్యింది. అదే కారణంగా సీత.. అభయ్‌తో వాగ్వాదానికి దిగింది. ‘‘ఎవరి గిన్నెలు వారు తోముకోండి’’ అంటూ అభయ్‌ను ఉద్దేశించి స్టేట్‌మెంట్ ఇచ్చింది సీత. ఆ మాటకు అభయ్ సీరియస్ అయ్యాడు.

బ్రెయిన్ ఉండాలి

‘‘నువ్వు నా కింద పనిచేయడం లేదు. అదే గేమ్’’ అని సీత చెప్పిన మాటకు కౌంటర్ ఇచ్చాడు అభయ్. ‘‘అంటే మీరు ఏమీ పనిచేయరా? మీ గిన్నెలు మేమెందుకు కడగాలి?’’ అంటూ అరవడం మొదలుపెట్టింది సీత. ‘‘నా ఇంట్లో ఎవడు పనిచేయడం లేదు. బ్రెయిన్ ఉండాలి అడిగేటప్పుడు’’ అని మరింత సీరియస్ అయ్యాడు అభయ్. దీంతో ఫీల్ అయిన సీత.. తినే అన్నం ముందు నుండి లేచి వెళ్లిపోయింది. అయినా కూడా అభయ్ తాను చేసిందే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. ఈ విషయంలో సీత ఫీల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది. ఎప్పుడూ గిన్నెలు కడుగుతూ ఉంటే గేమ్‌లో ముందుకు ఎప్పుడు వెళ్లాలి అంటూ విష్ణుప్రియాతో చెప్పుకొని బాధపడింది. యష్మీ గెలిచానని పొగరు చూపిస్తుండడంతో ఇతరులను చావగొట్టాల్సిన అవసరం లేదంటూ ఫీల్ అయ్యింది సీత.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×