Bigg Boss 8 Telugu Latest Promo: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అంతా మూడు టీమ్స్‌గా విడిపోయారు. చీఫ్స్‌గా బాధ్యతలు స్వీకరించిన నిఖిల్, నైనికా, యష్మీలకు కంటెస్టెంట్స్‌తో టీమ్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని బిగ్ బాస్ అందించారు. దీంతో యష్మీ టీమ్‌ను నలుగురు కంటెస్టెంట్స్, నైనికా టీమ్‌ను నలుగురు కంటెస్టెంట్స్ ఎంచుకున్నారు. కానీ నిఖిల్ టీమ్‌లో మాత్రం కేవలం ముగ్గురే ఉన్నారు. అందుకే యష్మీ, నైనికా టీమ్స్ మధ్య పోటీ మొదలయ్యింది. ఓడిపోయిన టీమ్‌లోని ఒక కంటెస్టెంట్‌ను నిఖిల్.. తన టీమ్‌లోకి తీసుకోవచ్చు. పోటీ మొదలయిన తర్వాత మొదటి టాస్క్‌లో యష్మీ టీమ్ విజయం సాధించింది. రెండో టాస్క్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
నిఖిల్ సపోర్ట్
యష్మీ, నైనికా టీమ్స్ పోటీపడడం కోసం బిగ్ బాస్ ఇచ్చిన రెండో టాస్క్ ‘లూప్ ది హూప్స్’. ‘‘మీకు ఇచ్చిన హూప్స్‌ను చైన్‌ను బ్రేక్ చేయకుండా, చేతులు వదలకుండా శరీరాల మీదుగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది’’ అంటూ ఛాలెంజ్‌కు సంబంధించిన రూల్స్‌ను వివరించారు బిగ్ బాస్. ఆట మొదలయిన తర్వాత యష్మీ టీమ్.. హూప్స్‌ను పూర్తి శరీరం సాయంతో పాస్ చేసుకున్నారు. కానీ నైనికా టీమ్ అలా చేయలేదు. కేవలం తల సాయంతో పాస్ చేసుకొని ముందుగా టాస్క్ పూర్తిచేశారు. దీంతో నైనికా టీమ్ రూల్స్ బ్రేక్ చేసిందని యష్మీ టీమ్ ఫైర్ అయ్యింది. సంచాలకుడిగా ఉన్న నిఖిల్ కూడా నైనికా టీమ్‌కు సపోర్ట్ చేయడంతో గొడవ పెద్దగా మారింది.
Also Read: చీఫ్‌ల చేతుల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. విష్ణుప్రియా చేసిన పనికి నిఖిల్ ఎమోషనల్
స్ట్రాటజీ ఉపయోగించాం
ముందుగా యష్మీ టీమ్‌కు చెందిన అభయ్.. నైనికా టీమ్ వారంతా తల నుండే హూప్స్‌ను పడేస్తున్నారని అరిచాడు. అది మా స్ట్రాటజీ అని నైనికా ఎదురుతిరిగింది. ‘‘ఫుల్ బాడీ అని చెప్పలేదు. చేతులు వదలకుండా పాస్ చేయమన్నారు. చేతులు వదలలేదు’’ అంటూ సీత, విష్ణుప్రియా.. రూల్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సంచాలకుడిగా నిఖిల్ నిర్ణయం ఏంటని యష్మీ టీమ్ అడిగారు. నిఖిల్ కూడా ఎవరి స్ట్రాటజీ వాళ్లది అన్నట్టుగా మాట్లాడాడు. దీంతో యష్మీ టీమ్‌లో ఉన్న పృథ్విరాజ్.. బాడీ అంటేనే ఫుల్ బాడీ అంటూ సీరియస్ అయ్యి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ‘‘అడ్డదిడ్డంగా ఆడడానికి మాకు చేత కాదు. రూల్స్ ఫాలో అవుతున్నాం’’ అంటూ యష్మీ కూడా నిఖిల్‌పై అరవడం మొదలుపెట్టింది.
చప్పట్లు కొడతాం
టాస్క్ అయిపోయిన తర్వాత కూడా నైనికా టీమ్ స్ట్రాటజీ గురించి యష్మీకి వివరించడానికి ప్రయత్నించాడు నిఖిల్. అయినా యష్మీ వినకుండా వ్యంగ్యంగా చప్పట్లు కొడుతూ అక్కడ నుండి వెళ్లిపోయింది. ‘‘వేరేవాళ్లు గెలిచినప్పుడు మేము చప్పట్లు కొట్టాం’’ అంటూ యష్మీ ముందే బేబక్కతో మాట్లాడింది సీత. అది విన్న యష్మీ.. తన దగ్గరకు వచ్చి మళ్లీ వ్యంగ్యంగా చప్పట్లు కొట్టింది. అలా బాడీ, ఫుల్ బాడీ మధ్య ఉన్న కన్‌ఫ్యూజన్ గురించి నిఖిల్, యష్మీ మధ్య గొడవ మొదలయ్యింది. ‘‘సంచాలకుడిగా బాడీ గురించి నువ్వు ఆలోచించలేదా’’ అంటూ నిఖిల్‌పై ఫైర్ అయ్యింది యష్మీ. మధ్యలో పృథ్విరాజ్ కూడా యష్మీకి సపోర్ట్‌గా నిఖిల్‌తో వాగ్వాదానికి దిగాడు.