E-Paper
Advertisement

Bigg Boss 8 Nainika: బిగ్ బాస్ నుంచి నైనిక అవుట్.. 5 వారాలకు అన్ని లక్షలు తీసుకుందా?

Bigg Boss 8 Nainika: బిగ్ బాస్ నుంచి నైనిక అవుట్..  5 వారాలకు అన్ని లక్షలు తీసుకుందా?

Bigg Boss 8 Nainika: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రియాలిటీ షో ఐదు వారాలు పూర్తి చేసుకుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పినట్లుగానే జరిగింది. బిగ్ బాస్ ఓటింగ్‌లో తక్కువ ఉన్న కంటెస్టెంట్స్‌ను మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆదిత్య ఓం, నైనీకాలు మంచి రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఎవరు ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

ఐదో వారం మిడ్ వీక్‌ ఎవిక్షన్‌లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. 33 రోజులు హౌజ్‌లో ఉన్న ఆదిత్య సుమారుగా రూ. 14,14,281 రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. అలాగే నిన్న హౌస్ నుంచి బయటకు వచ్చిన నైనిక వారానికి రూ. 2 లక్షల 20 వేలు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్ ద్వారా నైనిక ఐదు వారాల్లో సుమారుగా 11 లక్షల రూపాయాలు సంపాదించింది. అదే 36 రోజులకు లెక్కకడితే సుమారుగా రూ. 11, 31, 408 అందుకుంది. మొత్తానికి హౌస్ లో ఇన్ని రోజులుగా ఉన్నందుకు గాను ఆమె 11 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంది. పొట్టి పిల్ల గట్టిగానే సంపాదించింది.

ఇకపోతే నైనిక ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 ఈవెంట్‌తో 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హోజ్‌లోకి అడుగుపెట్టనున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా మెహబూబ్ షేక్, హరితేజ, గౌతమ్ కృష్ణ, నయని పావని, జబర్దస్త్ అవినాష్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ 8 మంది అడుగుపెట్టారు. వీరితోపాటు నాలుగో వారం ఎలిమినేట్ అయిన సోనియా రాబోతుంది. ఆమె లేకపోవడంతో హౌస్ లో గొడవలు అందుకే బిగ్ బాస్ ఆమె కోసం ప్లాన్ చేసి రప్పిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆరోవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..ఏది ఏమైనా గత సీజనలతో పోలిస్తే ఈ సీజన్ కాస్త బోరింగ్ గానే ఉంది. టాస్క్ లు కూడా చప్పగా ఉన్నాయని పస లేదనే టాక్ ను ఎప్పుడో అందుకున్నాయి. ఇక వైల్డ్ కార్డు ద్వారా వచ్చే హౌస్ మెట్స్ ఏదైన మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.. విన్నర్ అయితే నబీల్ అనే వార్తలు షో మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×