E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: సోనియా ముద్దు, యష్మీ వద్దు.. ఆ అమ్మాయిని కొట్టి హౌజ్‌లో నుండి వెళ్లిపోవాలనుంది అంటున్న నిఖిల్

Bigg Boss 8 Telugu: సోనియా ముద్దు, యష్మీ వద్దు.. ఆ అమ్మాయిని కొట్టి హౌజ్‌లో నుండి వెళ్లిపోవాలనుంది అంటున్న నిఖిల్
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ చీఫ్‌గా తనకంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పేరు తెచ్చుకున్నాడు నిఖిల్. కానీ అలాంటి నిఖిల్‌కు కంటెస్టెంట్స్ సపోర్ట్ లేక అతితక్కువమంది సభ్యులతో తన టీమ్ ఏర్పాటు అయ్యింది. అయినా కూడా గట్టి పోటీ ఇస్తాడనుకుంటే సోనియా చుట్టూ తిరుగుతూ తనే గ్రేట్ అన్నట్టుగా మారిపోయాడు. ఇక సోనియా కూడా మొదట్లో నిఖిల్ తనకు అస్సలు నచ్చలేదని చెప్పి.. ఇప్పుడు తనతోనే అందరికంటే ఎక్కువ క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టింది. అలా ఒకరికొకరు అందరి ముందు క్లోజ్‌గా ఉండకపోయినా వారిద్దరి మధ్య క్లోజ్‌నెస్ మాత్రం అందరికీ అర్థమవుతుంది. దానివల్లే ఇతర కంటెస్టెంట్స్‌తో నిఖిల్‌కు గొడవలు మొదలయ్యాయి.

బేబక్కతో గొడవ

Advertisement

చీఫ్స్‌కు టీమ్‌మేట్స్ సెలక్ట్ చేసుకోవాలి అనుకునే సమయంలో బేబక్క.. నిఖిల్ మీద ఉన్న ఇష్టంతో తన టీమ్‌లోకి వెళ్లడానికి ఇష్టపడింది. కానీ నిఖిల్ టీమ్ చిన్నది అవ్వడంతో తనకు, తన టీమ్‌మేట్స్ ఈవారం టాస్కుల్లో ఆడే అవకాశం లభించలేదు. సోనియాకు హౌజ్‌లోని చాలామందితో పాజిటివ్ రిలేషన్ లేదు. అలాగే బేబక్కతో కూడా లేదు. కానీ యష్మీ టీమ్ గెలిచి సోనియాను వారి టీమ్‌లోకి తీసుకున్నారు. ఇదే విషయంపై బేబక్కకు, నిఖిల్‌కు మధ్య వాగ్వాదం మొదలయ్యింది. తన టీమ్‌మేట్స్ మధ్య సంబంధాలు మంచిగా లేవు అన్నప్పుడు వాటిని సరిచేసే బాధ్యత టీమ్ లీడర్‌గా నిఖిల్‌కు ఉంటుందని బేబక్క వాపోయింది. కానీ బేబక్క వాదనను నిఖిల్ పట్టించుకోలేదు.

Also Read: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. బిగ్ బాస్ 8 మొదటి ఎలిమినేషన్‌లో ఇంటికి వెళ్లేది వీరే!

Advertisement

పట్టించుకోని సోనియా

తాను ఇష్టంగా తన టీమ్‌లో చేరినా, తన బాధ గురించి ఎంత చెప్పినా నిఖిల్ పట్టించుకోవడం లేదని బేబక్క కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయంపై నిఖిల్, బేబక్క సైతం సోనియా ముందే గొడవపడ్డారు. ఆ గొడవ తనకోసమే అని సోనియాకు తెలిసినా, బేబక్క తన దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనుకున్నా కూడా తను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అంతే కాకుండా విష్ణుప్రియా వచ్చి తనకు, నిఖిల్‌కు మధ్య పెరుగుతున్న బాండింగ్ గురించి సరదాగా అడిగినప్పుడు కూడా ఏడ్చి అందరి నోళ్లు మూయించింది సోనియా. అలా ఒకవైపు నిఖిల్, మరోవైపు సోనియా సైలెంట్‌గానే తమ బాండింగ్‌ను పెంచుకుంటూ కంటెస్టెంట్స్‌లో మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో కూడా డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.

తనకు పొగరు

మొదట్లో మంచి లీడర్‌గా పేరు తెచ్చుకున్న నిఖిల్.. సోనియా వల్ల అందరి చేత మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నిఖిల్ మాత్రం సోనియా మీద ఇష్టం ఉండుంటే తనను నామినేట్ చేయను కదా అనే లాజిక్‌తో కొడుతున్నాడు. ఇక యష్మీ టీమ్ విషయానికొస్తే.. తన లీడర్‌షిప్ తన సొంత టీమ్‌మేట్స్‌కు కూడా నచ్చడం లేదు. అదే విషయంపై అభయ్, సోనియా, నిఖిల్ చర్చించుకున్నారు. అదే సమయంలో యష్మీ వచ్చి కిచెన్‌లో కుకింగ్ గురించి గట్టిగా మాట్లాడుతుందని, పొగరు చూపిస్తుందని నిఖిల్ అన్నాడు. అంతే కాకుండా తనను లాగిపెట్టి కొట్టాలనిపించిందని, అలా చేయడం వల్ల తనను హౌజ్ నుండి పంపించేసినా పర్వాలేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×