BigTV English

Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. బిగ్ బాస్ 8 మొదటి ఎలిమినేషన్‌లో ఇంటికి వెళ్లేది వీరే!

Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. బిగ్ బాస్ 8 మొదటి ఎలిమినేషన్‌లో ఇంటికి వెళ్లేది వీరే!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి ఎలిమినేషన్‌కు సమయం వచ్చేసింది. ఈసారి నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ముందుగా మొదటి వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరు బయటికి వెళ్తారు అని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఎక్కువగా గొడవలు పడుతూ, నెగిటివ్‌గా ఉండేవారు మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోతారు. కానీ సీజన్ 8లో మాత్రం లాంచ్ డే నుండే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అందుకే అసలు ఈసారి ఎవరు బయటికి వెళ్లిపోతారని అంచనా వేయడం కొంచెం కష్టమే. కానీ ఈసారి డేంజర్ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ కచ్చితంగా ఉన్నారని సమాచారం.


సింపథీ స్టార్

మామూలుగా తమ పర్సనల్ లైఫ్ విషయాలను, బయట పడిన కష్టాలను బిగ్ బాస్ హౌజ్‌లో షేర్ చేసుకుంటే ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. అలా కొన్నిసార్లు సింపథీతో ప్రేక్షకులు.. ఆ కంటెస్టెంట్‌ను సపోర్ట్ చేయడం మొదలుపెడతారు. నాగమణికంఠ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి అదే సింపథీని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన పర్సనల్ లైఫ్ గురించి, తన భార్య గురించి, పాప గురించి పదేపదే చెప్పడం వల్ల ప్రేక్షకులు కూడా మణికంఠ మరీ ఓవర్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. దీంతో ఆడియన్స్ దృష్టిలో తను సింపథీ స్టార్ అయిపోయాడు. తన కష్టాలను ఎక్కువగా చెప్పుకొని, ఎప్పుడూ ఏడుస్తూ ఉండడం వల్లే నాగమణికంఠ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌కు డేంజర్ జోన్‌లో ఉన్నాడని సమాచారం.


Also Read: సంచాలకుడిగా ఫెయిల్, పులిహోర రాజాగా పాస్.. బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త ప్రేమకథ!

కిచెన్ సెక్షన్

నాగమణికంఠతో పాటు డేంజర్ జోన్‌లో ఉన్న మరొక కంటెస్టెంట్ బేబక్క. ముందుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే కిచెన్ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకునేవారు ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించే అవకాశం తగ్గిపోతుంది. ఇంతకు ముందు సీజన్స్‌లో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. ఇప్పుడు బేబక్క విషయంలో కూడా అదే జరిగేలా ఉంది. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే ఎవరూ చెప్పకముందే కిచెన్‌లో ఉండాలని, కుకింగ్ చేయాలని సెలక్ట్ చేసుకుంది బేబక్క. దీంతో అసలు తన ఆటతీరు ఏంటో ప్రేక్షకులు చూడలేకపోయారు. ఇదే కారణంతో తను మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అవసరం రాలేదు

నాగమణికంఠ, బేబక్క.. ఇద్దరూ నిఖిల్ టీమ్‌లోనే సభ్యులుగా చేరారు. సమానంగా సభ్యులు ఉన్న నైనికా, యష్మీ టీమ్స్ మధ్య ఈవారం టాస్కులు జరిగాయి. వాటికి నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. దీంతో అసలు బేబక్క, నాగమణికంఠ ఇప్పటివరకు టాస్కుల్లో కూడా తమ టాలెంట్ ఏంటో చూపించుకునే అవకాశం రాలేదు. నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత వీరిద్దరూ పెద్దగా హైలెట్ అవ్వలేదు. నాగమణికంఠ అప్పుడప్పుడు తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడుతూ కెమెరా ముందుకు వచ్చాడు. కానీ బేబక్క మాత్రం పూర్తిగా ప్రేక్షకుల్లో ఇంకా రెజిస్టర్ అవ్వని క్యారెక్టర్‌లాగా మిగిలిపోయింది. ఇక ఈ ఇద్దరిలో మొదటివారం ఇంటికి ఎవరు వెళ్లిపోతారో చూడాలి.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×