BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Promo : పృథ్వీ vs టేస్టీ తేజ.. మీలో ఎవరు తెలివైన వారు..?

Bigg Boss 8 Telugu Promo : పృథ్వీ vs టేస్టీ తేజ.. మీలో ఎవరు తెలివైన వారు..?

Bigg Boss 8 Telugu Promo : తాజాగా బిగ్ బాస్ (Bigg Boss) ప్రోమో ని విడుదల చేయగా.. ఇందులో “మీలో ఎవరు తెలివైన వారు” అనే ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఇక అందులో భాగంగానే టాస్క్ కారణంగా పృథ్వీ వర్సెస్ టేస్టీ తేజ మధ్య గొడవ గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం…


ప్రోమో విషయానికి వస్తే.. ప్రోమోలో స్కూల్ మరియు న్యాయ వ్యవస్థను పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ ఈ మీలో ఎవరు తెలివైన వారు. బిగ్ బాస్ అడిగే ప్రశ్నలకు ఎవరు ఎక్కువ సమాధానాలు చెబుతారో వారే తెలివైన వారు అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. బిగ్ బాస్ అడిగే కొన్ని ప్రశ్నలను ఆలోచించి సమాధానం చెప్పాలి. ఎక్కువ సమాధానాలు వీలైనంత త్వరగా చెప్పాలి అంటూ బిగ్ బాస్ చెప్పగా టాస్క్ ప్రారంభం అవ్వగానే.. టేస్టీ తేజ, నబీల్ మధ్య పోటీ మొదలైంది. 13 హార్ట్స్ ఉంటాయి. కానీ మిగిలిన ఆర్గాన్స్ ఉండవు. పేకాట బిగ్ బాస్ అని, కార్డ్స్ అని చెబుతాడు టేస్టీ తేజ. దీంతో నబీల్ మాట్లాడుతూ.. పేకాటలో ఒక హార్ట్ బిగ్ బాస్ అంటూ చెబుతాడు. సంచాలక్ గా వ్యవహరించిన నిఖిల్ తో మీరేమంటారు అని బిగ్ బాస్ అడగగా టేస్టీ తేజ చెప్పిందే కరెక్ట్ అని చెబుతాడు నిఖిల్. దాంతో నువ్వు వాడికేనా సపొర్ట్ అంటూ దీనంగా అడిగాడు నబీల్.

ఆ తర్వాత నయని పావని, నిఖిల్ మధ్య పోటీ రాగా ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న బార్డర్లో విమానం పడిపోతే.. ఆ ప్లేన్ లో ఉన్న సర్వైవర్స్ ని ఏ స్టేట్లో పాతి పెడతారు అని అడగ్గా.. నయని పావని ఏ స్టేట్ చెందిన వారిని ఆ స్టేట్లో పాతి పెడతారు అని చెప్పింది. దీనికి బిగ్ బాస్ బ్రతికున్న వాళ్ళని కూడా పాతి పెడతారా అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత పృథ్వి, హరితేజ మధ్య పోటీ రాగా ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు. ఏంటది అని ప్రశ్నించగా హరితేజ కెమెరా బిగ్ బాస్ అని తెలపగా పృథ్వి గేట్ అని తెలిపారు. యష్మీ మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు బిగ్ బాస్. అప్పుడు యష్మీ… గేట్ కు ఉన్న తాళం అని సమాధానం చెబుతుంది. ఇలా మిగతా కంటెస్టెంట్స్ ని కూడా అటెన్షన్ చేస్తూ గేమ్ చాలా బాగా ఆడారు.


చివర్లో టేస్టీ తేజ, ప్రేరణ మధ్య పోటీ పడగా.. ఒక కోతి, ఒక ఉడత, ఒక పక్షి రేస్ పెట్టినప్పుడు. కొబ్బరి చెట్టు మీదకు వెళితే.. అందులో నుంచి ముందుగా అని చెబుతుండగానే ఇంకా ప్రశ్న పూర్తి కాగానే ప్రేరణ బజర్ ప్రెస్ చేసింది. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందుగా ఎవరు అరటి పండు కోయగలుగుతారు అంటూ ప్రశ్నించాడు బిగ్ బాస్. ప్రశ్న పూర్తిగా వినకుండానే బజర్ మోగించడంతో హరితేజ ఫైర్ అవుతూ ఇది మూడోసారి బిగ్ బాస్ అంటూ కామెంట్ చేసింది. సంచాలక్ గా వ్యవహరించిన నిఖిల్ ప్రశ్న రిపీట్ చేసే ప్రయత్నం చేయగా టేస్టీ తేజ ప్రశ్న రిపీట్ చేయొద్దు అంటూ అరిచాడు. మధ్యలో పృథ్వీ కలుగజేసుకొని గొడవపడగా టేస్టీ తేజ వర్సెస్ పృథ్వీ అన్నట్టుగా టఫ్ ఫైట్ సాగింది.

Related News

Bigg Boss 9 Promo: ఇదెక్కడి గోలరా.. ఆమె మాట వింటారంటున్న రీతూ!

Bigg Boss : బిగ్ బాస్ ఫైనల్ విజేత ఆమె.. ప్రైజ్ మనీ భారీగా కట్.. ఎందుకంటే?

Bigg Boss 9 Telugu: జాక్ పాట్ కొట్టేసాడే.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్..?

Bigg Boss Buzzz Promo: హౌస్ మొత్తం కట్టప్పలే.. వెన్నుపోటు పొడిచారు.. శివాజీ స్ట్రాంగ్ కౌంటర్..

Bigg Boss 9 Telugu : భరణిని బయటకు గెంటే గోల్డెన్ ఛాన్స్ మిస్… ఇంకా నాన్న మీద హోప్స్ ఉన్నాయా పాపా?

Bigg Boss 9 : తనుజ దొంగ గేమ్, అదే తప్పు ఇంకొకరు చేస్తే వదిలేస్తారా? 

Bigg Boss 9 : పాపం భరణికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు, తనను చూసి నేర్చుకోవాల్సింది ఇదే

Bigg Boss 9 Telugu: టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పిన ఇమ్మానుయేల్ బ్రదర్.. చాలా బాధగా ఉందంటూ!

Big Stories

×