BigTV English

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో సేఫ్ గేమ్.. ఆ ముగ్గురిని బయటికి పంపడం చాలా కష్టం!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో సేఫ్ గేమ్.. ఆ ముగ్గురిని బయటికి పంపడం చాలా కష్టం!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో ఎక్కువకాలం ఉండాలంటే కెమెరాలకు ఎక్కువగా కనిపించాలి. వారు చేసే పనులు ఆడియన్స్‌కు కనిపించాలి. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా వారి మొహాలు ఎక్కువగా ఆడియన్స్‌కు కనిపిస్తే ఓట్లు పడతాయి. అలా కాకపోయినా గొడవలు పడకుండా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయే కంటెస్టెంట్స్ కూడా చాలామంది ఆడియన్స్‌కు నచ్చుతారు. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ రెండు కేటగిరిలకు చెందిన కంటెస్టెంట్స్ ఉన్నారు. కొందరు హౌజ్‌లోకి ఎంటర్ అయిన మొదటి వారంలోనే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని నెగిటివ్ అవ్వగా.. కొందరు మాత్రం సేఫ్‌గా ఆడుతూ ఓట్లు పెంచుకుంటున్నారు.


పొగరే నచ్చింది

బిగ్ బాస్ సీజన్ 8 మొదటివారం నామినేషన్స్‌ నుండి ముందుగా సోనియా సేవ్ అయ్యింది. సోనియా సేవ్ అవ్వడం చాలామంది ఆడియన్స్‌కు నచ్చలేదు. సోషల్ మీడియాలో తనపై పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా అందరిలో తను ముందుగా సేవ్ అయ్యింది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. తను మాత్రమే కరెక్ట్ అన్నట్టుగా, ఇతరులు కరెక్ట్ కాదు అన్నట్టుగా ప్రతీ సందర్భంలో నిరూపించడానికి ట్రై చేస్తుంది సోనియా. పైగా తన పొగరు కూడా చాలామంది ఆడియన్స్‌కు నచ్చి తనకు ఓట్లు వేయడం మొదలుపెట్టారు. అలా ఇప్పట్లో సోనియా.. హౌజ్ వదిలి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. తను టాప్ 5 వరకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు.


Also Read: బిగ్ టీవీలో స్పెషల్ షో మొదలు.. ‘కిర్రాక్ కపుల్స్’ అంటూ బుల్లితెర జోడీలతో రామ్‌ప్రసాద్ సందడి

గొడవలు వద్దు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభయ్ నవీన్ గురించి చాలామంది ప్రేక్షకులకు తెలుసు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన తర్వాత తన ఆటతీరు చాలామందిని ఆకట్టుకుంది. కొంతమందితో అనవసరంగా గొడవలు పడుతున్నాడని అనిపించినా కూడా తనకు నచ్చని విషయాన్ని సూటిగా చెప్పడం, తన టీమ్‌లో సభ్యులు తప్పు చేశారని అనిపించినా ఎదిరించి మాట్లాడడం.. ఇవన్నీ అభయ్‌కు మంచి ఓట్ బ్యాంక్‌ను తెచ్చిపెట్టాయి. తనతో పాటు ఆదిత్య ఓంకు కూడా బయట మంచి పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఎవరితో గొడవ పెట్టుకోకపోవడం, అందరితో మంచిగా, సాయంగా ఉండడం.. ఇలాంటి లక్షణాలు ఆదిత్య ఓంకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుతున్నాయి.

పాజిటివిటీ ఏర్పడింది

అభయ్ నవీన్, ఆదిత్య ఓంతో పాటు ఒక ఫీమేల్ కంటెస్టెంట్ కూడా కొన్నివారాల పాటు సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం ఉంది. తనే ప్రేరణ. మొదట్లో అల్లరి పిల్లగా హౌజ్‌లోకి అడుగుపెట్టింది ప్రేరణ. కానీ ఇతర కంటెస్టెంట్స్ గొడవలపై ప్రేక్షకుల ఫోకస్ వెళ్లడం వల్ల ప్రేరణ అల్లరి అంతగా కనిపించడం లేదు. మొదట్లో ఒకరిద్దరితో గొడవపడినా కూడా తన తప్పు ఉంది అనిపిస్తే వెంటనే వెళ్లి సారీ చెప్పడం లాంటి లక్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ పట్ల ప్రేక్షకుల్లో పాజిటివిటీ ఏర్పడడంతో వీరు అప్పుడే హౌజ్‌ను వదిలి వెళ్లే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎక్కువరోజులు టాస్కుల్లో యాక్టివ్‌గా లేకపోతే ప్రేరణ, ఆదిత్య ఓంలు కూడా ఓట్లు సాధించడం కష్టమని తెలుస్తోంది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×