E-Paper
Advertisement

Beetroot Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు సమస్యలకు చెక్ !

Beetroot Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు సమస్యలకు చెక్ !

Beetroot Hair Mask: ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టుతో ఇబ్బందిపడుతున్నారు. అంతే కాకుండా రంగు మారిన జుట్టు కోసం రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడుతున్నారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే. అలాంటి వారు.. ఇంట్లోనే సహజంగా జుట్టు నల్లబడటానికి హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకుని వాడవచ్చు. అలాంటిదే బీట్ రూట్ హెయిర్ మాస్క్ . బీట్ రూట్ హెల్తీ వెజిటెబుల్ మాత్రమే కాదు.. ఇది చర్మం, జుట్టు సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

బీట్ రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్, ఫోలేట్, విటమిన్, ఏ ,సి, అంతే కాకుండా ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియం కూడా ఉంటాయి. ఇందులోని విటమిన్లు హెయిర్ ఫోలికల్స్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాకుండా జుట్టు మూలాల నుంచి బలంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

బీట్ రూట్ రసం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ రసం జుట్టు రంగును మెరుగుపరుస్తుంది. తెల్ల జుట్టును నల్లగా రంగు మార్చేందుకు బీట్ రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సహజమైన హెయిర్ డై లాగా పనిచేస్తుంది.

Also Read: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం !

1. కొబ్బరి నూనె , బీట్ రూట్ రసంతో హెయిర్ మాస్క్: 
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి నూనె, బీట్ రూట్ రసాన్ని సమపాళ్లలో తీసుకుని మిక్స్ చేసి హెయిర్‌కి అప్లై చేయాలి. దీనిని సుమారు 2 గంటల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది. తరుచుగా ఈ హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.

Related News

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Big Stories

×