BigTV English

Bigg Boss 8: 4 వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే.. టఫ్ కాంపిటీషన్ మధ్య నెగ్గేదెవరు..?

Bigg Boss 8: 4 వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే.. టఫ్ కాంపిటీషన్ మధ్య నెగ్గేదెవరు..?

Bigg Boss 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ (Bigg Boss). ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. మూడు వారాలు ఇప్పటికే జరిగిపోయాయి. మొదటి వారంలో భాగంగా బెజవాడ బేబక్క, రెండవ వారం ఆర్. జే. శేఖర్ భాష, మూడవ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగవ వారానికి సంబంధించి ఎలిమినేషన్స్ కు కావలసిన నామినేషన్స్ నేటితో పూర్తయింది. నాలుగవ వారానికి సంబంధించి నామినేషన్ లిస్ట్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ను చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. అందరూ కూడా టాప్ కంటెస్టెంట్స్ లిస్టులోకి వచ్చేసారు. మరి ఇంత పోటాపోటీ మధ్య నెగ్గేది ఎవరు అనే విషయం ఆసక్తికరంగా మారింది.


నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్..

Bigg Boss 8: These are the nominated contestants for week 4.. Who will win amid the tough competition..?
Bigg Boss 8: These are the nominated contestants for week 4.. Who will win amid the tough competition..?

మూడు వారాలుగా జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని, ఈ వారం నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున నామినేట్ చేయమని బిగ్ బాస్ ప్రకటించగా.. ఎవరికి వారు తమ కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ముఖ్యంగా ఈ నామినేషన్ ప్రక్రియ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకరికొకరు వల్గర్ గా మాట్లాడుకున్న సందర్భాలు కూడా అందర్నీ ఆశ్చర్యపరిచాయని చెప్పవచ్చు. మరి ఈ నాలుగవ వారం నామినేషన్ లిస్టులో ఉన్న టాప్ సెలబ్రిటీల విషయానికొస్తే.. ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, నాగ మణికంఠ, పృథ్వీ రాజ్ శెట్టి , నబీల్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.


టఫ్ కాంపిటీషన్..

ఇకపోతే తాజాగా నామినేషన్ లిస్టు లోకి వచ్చిన ఆరుగురు కూడా గత వారం టాస్క్ లలో పోటాపోటీగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేరణ అయితే తన చేతులకు గాయాలైనా సరే ఆటను విడవలేదు. ముఖ్యంగా ఎదుటి చీఫ్ కి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఇక నాగ మణికంఠ, సోనియా , నబీల్, పృథ్వీరాజ్ అందరూ కూడా ఎవరికి వారు తమ స్ట్రాటజీ చూపించి గేమ్ లో విన్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇకపోతే గట్టిగా వాదలాడుకుని ఒకరికొకరు నామినేట్ చేసుకున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు నామినేషన్ లిస్టులోకి వచ్చేసారు. ఇంత టాప్ కంటెస్టెంట్ లో ఎవరికి ఓటు వేయాలి అని అటు ఆడియన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్య ఎవరు నెగ్గుతారు అనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు ఎదురుచూడాల్సి.

సోనియా మాటలు నిజమవుతాయా..

ఈ వారం నామినేషన్ లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారని, అతడే ఇంటికి పోతారని స్పష్టంగా చెప్పేసింది సోనియా. మరి సోనియా చెప్పినట్టు ఈ వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారా లేక ఇంకొకరిని బలి చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

.

Related News

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Big Stories

×