BigTV English

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Medigadda Barrage Work Completion Certificate Canceled: మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్ తగిలింది. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ విషయంలో మేడిగడ్డ నిర్మాణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మేడిగడ్డ నిర్మాణ పని పూర్తయిందని ఇచ్చిన వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అంతేకాదు, మిగిలిన పనులను సైతం అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ చీఫ్‌నకు నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత శాఖ ఇంజినీర్లు.. మేడిగడ్డ ఇంజినీర్లను కోరినట్లు తెలుస్తోంది. అయితే గుత్తేదారులు 2019 జూన్ 20వ తేదీన కాళేశ్వరం నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత 2019 నవంబర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ లీకులు జరిగాయని వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నారు. అయినప్పటికీ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

అలాగే, వర్క్ సర్టిఫికెట్ విషయంలో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు జరిగిన ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయలేదని చెప్పింది. ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని గుత్తేదారు కోరి తీసుకోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ తప్పుబట్టింది. పనులు పూర్తి కాకుండానే సర్టిఫికెట్ చేశారని, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని సిఫార్స్ చేసింది.


కాగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌కు ఇచ్చినప్పటికీ తన వద్దకు చేరకముందే.. గుత్తేదారు మేడిగడ్డ పనులు పూర్తయినట్లు తీసుకున్న వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్‌ను సర్కార్ రద్దు చేయడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా, మేడిగడ్డ ఆనకట్టుపై ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చిందని నీటి పారుదల శాఖ పేర్కొంది. ఈ మేరకు గత నెలలో నీటి పారుదల శాఖ ఏఎంసీ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాశారని పేర్కొంది. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్‌తో పాటు పలు వైఫల్యాలను సీఎం ఎత్తి చూపారని తెలిపారు.

2019-20లోనే మేడిగడ్డ నిర్వహణలో సమస్య తలెత్తిందని, ఈ సమయంలో సీసీ బ్లాకులు పక్కకు వెళ్లిపోయాయని చెప్పారు. 2019 నవంబర్ నెలలో ఈ సమస్య గుర్తించినప్పటికీ పట్టించుకోకపోవడంతో పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతోనే అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. గత నెలలో రాసిన ఈ లేఖకు రెండు రోజుల క్రితం సీఈ నీటి పారుదల శాఖ ఏఎంసీ లేఖ రాశారు

ఇందులో ఒప్పందం ప్రకారం, మేడిగడ్డ పనులు పూర్తి కాలేదని, ఇంకా చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. అనుభవ సర్టిఫికెట్ బదులు.. పూర్తయినట్లు సర్టిఫికెట్ మంజూరు అయిందన్నారు. ఈ సర్టిఫికెట్ పొరబాటున ధృవీకరణ పత్రం ఇచ్చామని సంబంధిత ఇంజనీర్లు తెలియజేశారని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Also Read: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

ఈ సర్టిఫికెట్‌ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇవ్వగా.. ఎస్ఈ కౌంటర్ సంతకం చేశారు. సీఈ లేఖపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related News

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×