Nagarjuna 100: సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)ఇప్పటివరకు హీరోగా 99 సినిమాలలో నటించారు. అయితే ఈయన నటించబోయే తన100 వ సినిమా తన కెరియర్ కు ఎంత కీలకంగా మారనుంది. నాగార్జున సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలవబోతోంది. అందుకే ఈ సినిమా విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాకు “లాటరీ కింగ్”(Lottery King) అని పేరు పెట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి .అలాగే ఈ సినిమాలో సీనియర్ నటి టబు(Tabu) కూడా భాగం కాబోతోందని సమాచారం.
ఇక ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందు రాబోతుందని ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయంలో కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పాత్రలో మరొక స్టార్ హీరో క్యామియో పాత్రలో నటించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సీనియర్ నటి అనుష్క శెట్టి(Anushka Shetty) కూడా కీలకపాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా కోసం అనుష్కను సంప్రదించడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
ఈ సినిమాలో టబుతో పాటు అనుష్క కూడా కనిపించబోతున్నారని విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగార్జున అనుష్క కాంబినేషన్లు ఇదివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. అనుష్క ఇండస్ట్రీకి నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనంతరం వీరి కాంబినేషన్ లో డాన్, రగడ, డమరుకం, ఓం నమో వెంకటేశాయ, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో నటించారు. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో అరడజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
నిరాశపరిచిన ఘాటీ..
ఇలా అనుష్క నాగార్జున కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ తరుణంలోనే నాగార్జున కెరియర్ లోనే ఎంతో కీలకంగా మారిన ఈ 100 వ సినిమాలో కూడా అనుష్క కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ విషయాలపై మేకర్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. అనుష్క సినీ కెరియర్ విషయానికి వస్తే ఈమె ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటించిన ఘాటీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Also Read: MSVPG: మన శంకర వరప్రసాద్ గారి కోసం మరో హీరోయిన్..ఇలా లీక్ చేసారేంటీ?