Bigg Boss : బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది నటి నటులు బాగా ఫేమస్ అవుతున్నారు.. ఫేమస్ మాట పక్కన పెడితే కొన్నిసార్లు వివాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఈమధ్య చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. కన్నడ బిగ్ బాస్ లో తన అందం, ఆట తీరుతో ఆకట్టుకున్న బ్యూటీ దివ్య సురేష్ ఓ యాక్సిడెంట్ కేసు లో ఇరుక్కుంది. తన కారుతో బైకును డీకొట్టి ఆపకుండా అక్కడ నుంచి ఉడాయించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె పై హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ల బంధువు ఒకరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్య సురేష్ అర్ధరాత్రి తన కారుతో వీరంగం సృష్టించిన విషయం ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జరిగి చాలా రోజులు అయింది.. అయితే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అసలు విషయం ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది.. దివ్య కారుతో వేగంగా వెళుతూ బైక్ పై వస్తున్న ముగ్గురిని ఢీ కొట్టింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చూడకుండా అక్కడి నుంచి ఉడాయించేసింది.. ఈ యాక్సిడెంట్ సమయంలో బైక్ మీద వచ్చిన ముగ్గురిలో ఒక యువతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.. దాంతో ఆ యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారులో దివ్య సురేష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో ఆమెపై కేసు నమోదు చేశారు. అంతే కాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె కారుని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. నటి పై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారా? డ్రైవింగ్ లైసెన్స్ ని సీజ్ చేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
Also Read : శనివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మూవీ లవర్స్ మాస్ జాతరే..
కన్నడ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో దివ్య సురేష్ ఒకరు.. తన అందం, ఆటతీరు మాటతీరుతో కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్ లో ఆమె చురుగ్గా పాల్గొనడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈమె ఫాలోయింగ్ కూడా పెరగడంతో వరుసగా సినిమాలు చేసి బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఏవో రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో ఈమె ఓ సినిమాలో నటించింది. ‘టెంప్ట్ రాజా’ అనే తెలుగు సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు.. ఇప్పుడు ఆక్సిడెంట్ కేసు ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది.. దీనిపై ఈ నటి ఎలా స్పందిస్తుందో చూడాలి…