Bigg Boss 9 Promo 3: బిగ్ బాస్ హౌజ్‌లో నేడు నామినేషన్స్ హీట్ హద్దులు దాటింది. రీతూపై సంజన చేసిన కామెంట్స్ హౌజంత షాకైంది. దీంతో నామినేషన్ ఉద్రిక్తంగా మారాయి. బిగ్ బాస్ 1 2వ వారంకి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వరుస ప్రొమోలో విడుదల చేస్తుంది బిగ్ బాస్ టీం. నేటి నామినేషన్స్‌కి సంబంధించి ఇప్పటికే రెండు ప్రొమోలు విడుదలయ్యాయి. భరణి దివ్యని, ఇమ్మాన్యుయేల్, సుమన్ లు తనూజని, కళ్యాణ్ డిమోన్‌ని నామినేట్ చేసింది చూపించారు.
ఇక కాసేపటికి క్రితమే మూడో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నామినేషన్స్ హీట్స్ ఓ స్థాయికి వెళ్లింది. ఇందులో రీతూ.. సంజనని నామినేట్ చేయగా.. తనని డిఫెండ్ చేసుకునే క్రమంలో రీతూపై ఊహించని కామెంట్స్ చేసింది. ఫైర్ స్ట్రోమ్స్ వచ్చినప్పటి నుంచి అసలు నీ గేమే కనిపించడం లేదంటూ రీతూ సంజనని నామినేట్ చేసింది. దీనికి సంజన ఆరో వారం నుంచి 12 వారం దాకా తిని పడకుంటనే ఇక్కడవరకు రాను కదా. ఆట ఆడాను కాబట్టే ఇక్కడి వరకు వచ్చానని, అసలు నీలా నేను ఇంట్లో బూతులుగా కూడా మాట్లాడను. నువ్వు రాత్రంత వెళ్లి డిమోన్ *** కూర్చుంటావంటూ రీతూపై నోరు జారింది.
ఆమె మాటలకు హౌజంత షాకైంది. కళ్లు మూసుకునేంత ఏం చేశానంటూ రీతూ ఆవేదన చెందింది. ఇక ఇమ్మూ సంజన దగ్గరికి వచ్చిన మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు వెనక్కి తీసుకో అంటూ గట్టిగా అరిచి చెప్పాడు. ఇదంత చూస్తుంటే ఈ రోజు హౌజ్‌లో ఫుల్ రచ్చ రచ్చ ఉండనుందని అర్థమైపోతుంది. ప్రోమో ప్రారంభంలో డిమోన్ ఇమ్మాన్యుయేల్‌ని నామినేట్ చేసింది చూపించారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా అంటూనే డిమోన్ ఏడ్చాడు. ఇమ్మూని నామినేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, టాస్క్‌లో తనకు సపోర్టు చేస్తానని చేయకుండ మరో టీంకి చేసి మోసం చేశావనే కారణంతో చేశాడు. టీం కోసం ఆడాలి కదా అంటే.. ఇది టీం కాదు కటెండర్ అన్నాడు.
ఇలా టాస్క్‌లో మొదట ఒక మాట చెప్పి తర్వాత మాట మార్చవంటూ ఇమ్మూని నామినేట్ చేస్తుంటే మధ్యలో కళ్యాణ్ కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య వాదన పెరగడంతో రీతూ, ఇమ్మూ, కళ్యాణ్, డిమోన్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఈ నామినేషణ్ అటూ ఇటూ తిరిగి కళ్యాణ్-రీతూల వరకు వెళ్లినట్టు కనిపించింది. నీవల్లే డిమోన్ గేమ్ ఆడటం లేదని రీతూపై గట్టిగా అరిచాడు కళ్యాణ్. ఆ తర్వాత తనూజ.. దివ్యని నామినేట్ చేసింది. మూడు వారాలుగా నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు.. కానీ, నాకు నీతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మన ఇద్దరం ఒక వ్యక్తి గురించి కొట్టుకున్నామనే ముద్ర తీసేద్దాం. ఇక నుంచి మనిద్దరి మధ్య ఇలాంటివి వద్దు అంటూ దివ్యతో ఉన్న ఇష్యూని సాట్ అవుట్ చేసుకోవాలని చూసింది. ఆమె నామినేషన్‌కి కూడా యాక్సెప్ట్ చేస్తూ దివ్య కూడా తనూజతో కలిసిపోయింది. చివరికి వీరిద్దరు కలిసిపోయారు.
Also Read: Bigg Boss 9 Promo: వైల్డ్ ఫైర్ నామినేషన్.. వేలు చూపించకు.. దివ్యకు భరణి వార్నింగ్