E-Paper
Advertisement

Gautam Gambhir: ట్రోలింగ్ తట్టుకోలేక.. కోచ్ పదవికి గంభీర్ రాజీనామా.. కొత్త వ్యక్తికి BCCI ఛాన్స్ ?

Gautam Gambhir:  ట్రోలింగ్ తట్టుకోలేక.. కోచ్ పదవికి గంభీర్ రాజీనామా.. కొత్త వ్యక్తికి BCCI ఛాన్స్ ?
Advertisement

Gautam Gambhir: టీమిండియా క్రికెట్ లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఉన్న గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గౌతమ్ గంభీర్ ప్రకటన విడుదల చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా టీమిండియా కు ఎన్నో సేవలు అందించాలని, జట్టు విజయానికోసం ఎన్నో ప్రయోగాలు చేశాను.. కానీ తనపై మాత్రం ట్రోలింగ్ ఆగడం లేదు… రోజు రోజుకు తారాస్థాయికి చేరుతోందని గౌతమ్ గంభీర్ ఎమోషనల్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ కూడా వైరల్ గా మారింది.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

నిజంగానే గౌతమ్ గంభీర్ రాజీనామా చేశాడా ?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ నిజంగానే రాజీనామా చేశాడా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. సోషల్ మీడియాలో తన పేరుతో రాజీనామా లేక వైరల్ అయిన నేపథ్యంలో అందరూ షాక్ అయ్యారు. అతడు అంటే పడని వారు సంబరాలు చేసుకుంటే, మరికొంతమంది గౌతమ్ గంభీర్ ఉండాల్సిందేనని అంటున్నారు. గౌతమ్ గంభీర్ వల్ల వాషింగ్టన్ సుందర్ టాలెంట్ బయటపడిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే గౌతమ్ గంభీర్ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఆయన రాజీనామా చేసినట్లు కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్లు బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. గౌతమ్ గంభీర్ రాజీనామా చేసినట్లు గాని, చేయబోతున్నట్లుగాని ఎలాంటి సమాచారం లేదని తెలిపాయి. దీంతో గౌతమ్ గంభీర్ రాజీనామా చేసిన వార్త ఫేక్ అని తెలుస్తోంది. కావాలని కొంతమంది ఆయన పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి రాజీనామా లేఖను విడుదల చేసినట్లు చెబుతున్నారు.

ఒకవేళ గౌతమ్ గంభీర్ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి ?

టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ రాజీనామా చేస్తే కొత్త వారికి కచ్చితంగా అవకాశం వస్తుంది. చాలామంది హైదరాబాద్ స్టైలిష్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ కు పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అతనికి కోచ్ పదవి ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. లేదా రవి శాస్త్రికి మరోసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే మహేంద్రసింగ్ ధోనీని రంగంలోకి దింపి కోచ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ధోని హెడ్ కోచ్ అయితే టీమిండియా మళ్లీ షైనింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

గంభీర్ పైన ట్రోలింగ్ ఎందుకు?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన మొదటి నుంచి వ్యతిరేకత మొదలైంది. మహమ్మద్ షమీ, రుతురాజ్, యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా లాంటి కీలక ప్లేయర్లకు టీమిండియాలో సరిగ్గా అవకాశం దక్కడం లేదు. ఒకరు t20 లో ఉంటే వన్డేలో ఉండటం లేదు. మరొక ప్లేయర్ వన్డేలు ఆడితే టెస్ట్ లో కనిపించడం లేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీ నే పీకి పారేశాడు గంభీర్. హర్షిత్ రానా లాంటి చిన్న స్థాయి ప్లేయర్ కు మూడు ఫార్మాట్స్ లో ఛాన్స్ ఇస్తున్నాడు. పూర్తిగా అనుభవం రాకముందే గిల్ కు కెప్టెన్సీ ఇచ్చేశాడు. గంభీర్ కోచ్ అయిన తర్వాత సొంత గడ్డపై దాదాపు నాలుగు సిరీస్ లు టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో కూడా మట్టి కరిచే ప్రమాదం ఉంది. అందుకే గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×