BigTV English

Bigg Boss season 9 : నాగార్జున మాస్ కౌంటర్లు, అందరికీ ఇచ్చి పడేసాడు, ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

Bigg Boss season 9 : నాగార్జున మాస్ కౌంటర్లు, అందరికీ ఇచ్చి పడేసాడు, ఎపిసోడ్ హైలైట్స్ ఇవే

Bigg Boss season 9 : బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రతి వారం కింగ్ నాగార్జున వచ్చి అందరికీ స్వీట్ వార్నింగ్స్ ఇస్తారు అనే విషయం తెలిసిందే. ఈ వారం కూడా కింగ్ నాగార్జున వచ్చి హౌస్ మెట్ అందర్నీ సెట్ చేశారు.


మొదటివారం సంజన గుడ్డు దొంగతనం చేసిన విషయం తెలిసిందే. దాని గురించి కొంత సేపటి వరకు డిస్కషన్ జరిగింది. బిగ్ బాస్ తంసప్ టాస్క్ ఒకటి పెట్టారు. ఈ టాస్క్ విషయంలో సంజనకు భరణికి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇవన్నీ కూడా కింగ్ నాగార్జున అబ్జర్వ్ చేశారు.

కింగ్ కౌంటర్లు 

గేమ్ ఎంత ఆసక్తికరంగా సాగినా కూడా మీరు మాత్రం బీన్ బ్యాగ్ దగ్గర కూర్చునే ఉంటారు అని కింగ్ నాగార్జున హరీష్ కు వార్నింగ్ ఇచ్చారు. అందరికీ స్టార్స్ ఇచ్చి అలానే అలానే కింగ్ చుక్కలు చూపించారు. ఇమ్మానుయేల్ ని పొగడ్తలతో ముంచేశారు. ఇమ్మానుయేల్ లవ్ స్టోరీని మరోసారి గుర్తు చేశారు నాగార్జున. తనకి గోల్డెన్ స్టార్ ఇచ్చారు.


వాళ్ల పర్ఫామెన్స్ ని బట్టి గోల్డెన్ స్టార్ తో పాటు సిల్వర్ స్టార్లు కూడా కొంతమందికి ఇచ్చారు. సుమన్ శెట్టి, శ్రీజ దమ్ము కి సిల్వర్ స్టార్లు ఇచ్చారు నాగార్జున. గేమ్ విషయంలో నేను 100% ఇచ్చాను అంటూ తనూజ నాగర్జునతో చెప్పుకొని నాకు గోల్డెన్ స్టార్ కావాలి అని రిక్వెస్ట్ చేశారు. కానీ నాగార్జున మాత్రం తనుజాకి సిల్వర్ స్టార్ ఇచ్చారు.

కిచెన్ విషయంలో పోపు గురించి డిస్కషన్ జరిగింది. అయితే వీడియోలన్నీ చూపించిన తర్వాత గోల్డెన్ స్టార్ ఇమ్మానుయేల్ లో పోపు విషయంలో ఎవరిది తప్పు అని కింగ్ నాగార్జున ప్రశ్నిస్తే తనుజ అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

కెప్టెన్ పవన్ తో కింగ్ నాగార్జున కొన్ని విషయాలు చర్చించారు. పవన్ విషయంలో కొన్ని విషయాల్లో పార్షియాలిటీ చూపిస్తారు అని శ్రీజ దమ్ము చెప్పింది. నేనెప్పుడూ అలా చూడలేదు అంటూ పవన్ రిటర్న్ ఆర్గ్యుమెంట్ కూడా నాగార్జున ముందు చేశాడు. కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఈవారం చాలా బాగా ఆడావు అనే నాగార్జున చెప్పి తనకు సిల్వర్ స్టార్ ఇచ్చారు. సిల్వర్ స్టైల్ ఇస్తూ కూడా నిన్ను గోల్డెన్ స్టార్ గా చూడాలనుకుంటున్నాను అని కింగ్ నాగార్జున చెప్పారు.

భరణిని ఉద్దేశిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మావయ్య క్యారెక్టర్ లాగా నువ్వు కనిపిస్తున్నావు అంటూ చెప్పారు. ఈవారం భుజం నొప్పి వలన టాస్కులు ఆడలేకపోయాను అని చెప్పేసావ్ కానీ నీ భుజాల మీద ఎక్కువ బాంధవ్యాలను పెట్టుకున్న అంటూ నాగ్ భరణితో చెప్పారు.

హరిత హరీష్ మరియు సంజనా మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ నాగార్జున ముందు జరిగింది. అయితే హరీష్ గురించి సంజనా చెప్పిన విషయాలను కూడా 100% కరెక్ట్ అంటూ నాగార్జున చెప్పేశారు.

 

హరీష్ కు మాస్ వార్నింగ్

నాగార్జున హరీష్ ను ఉద్దేశిస్తూ… నీ పార్టిసిపేషన్ గేమ్ లో లేదు, చాలా ఒంటరిగా ప్రవర్తిస్తున్నావు. నీ మీద చాలా అంచనాలు ఉండేవి, నీకున్న మైండ్ కి, నీకున్న క్లారిటీకి మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతావు అనుకున్నాను కానీ నువ్వు అవ్వలేదు అంటూ నాగార్జున చెప్పేశారు. నీకున్న జడ్జ్మెంట్ కెపాసిటీకి నువ్వు వాడే గేమ్ కి అసలు పొంతనలేదు అంటూ నాగార్జున చెప్పేశారు. అగ్నిపరీక్షలో నిన్ను చూసిన తర్వాత ఆకాశంలో ఉంటావు అనుకుంటే పాతాళంలో ఉన్నావ్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దొంగతనానికి ప్రాంక్ కి తేడా తెలియదు

సంజనాని ఉద్దేశిస్తూ నీకు ప్రాంక్ కి దొంగతనానికి తేడా తెలియడం లేదు. అందరినీ హుషారు పరిచేది ప్రాంక్. నీకోసం నలుగురు ముందుకు వచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యేలా చేశారు. ఆ నలుగురు కూడా ఇప్పుడు నీతో లేరు. నువ్వు మైండ్ సెట్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. భరణి నీకోసం చాలా సాగ్రిఫై చేశాడు. అలాంటి భరణి నీకు సిగ్గుండాలి అని అన్నాడు అంటే రీజన్ ఏంటో గుర్తించుకోవాలి. అమ్మాయిల గురించి అమ్మల గురించి క్లారిటీ ఇస్తూ సంజనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. మొత్తానికి సంజనాకు సిల్వర్ స్టార్ ఇచ్చారు. నేను చాలా హానెస్టీగా ఐదు గుడ్లు దాచాను సార్ అని సంజన చివర్లో చెప్పే ప్రయత్నం చేసింది. హానెస్ట్రీకి అసలు నీకు స్పెల్లింగ్ తెలియదు అమ్మ అంటూ స్మూత్ గా డీల్ చేశారు నాగ్.

Also Read : Bigg Boss Promo : గుడ్డు దొంగ పరువు తీసిన నాగ్.. చూడాలని ఉందంటూ ఏడ్చేసిన ఇమాన్యూయెల్

Related News

Bigg Boss 9 Promo : గుడ్డు దొంగ పరువు తీసిన నాగ్.. చూడాలని ఉందంటూ ఏడ్చేసిన ఇమాన్యూయెల్

Bigg Boss 9 : ఎలిమినేట్ అయిపోయిన మరో కామనర్, ట్రోఫీ సెలెబ్రిటీలకే అంకితమా?

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం వచ్చిన తిప్పలు, అందరూ కన్నీటి కొళాయిలు ఓపెన్ చేశారు

Bigg Boss 9 Promo2: కళ్యాణ్‌కు రీతూ వెన్నుపోటు.. మళ్లీ కుళాయి ఓపెన్ చేశాడుగా!

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?

Big Stories

×