E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఆ అమ్మాయికి దూరంగా ఉండు… బాండింగ్స్ పై భరణికి కూతురు వార్నింగ్

Bigg Boss 9 Telugu : ఆ అమ్మాయికి దూరంగా ఉండు… బాండింగ్స్ పై భరణికి కూతురు వార్నింగ్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో భరణి బాండింగ్స్ తో ఎంత నెగెటివ్ అయ్యారో షోను చూసే వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుండడంతో భరణి, తనూజ, దివ్య ఫ్యామిలీల రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూశారు ఆడియన్స్. ఆ ఎదురు చూపులకు తాజా ఎపిసోడ్ తో ఫుల్ స్టాప్ పడింది.

జెండూ బామ్ లా తయారైన దివ్య

ఈరోజు ఎపిసోడ్ లో కూడా దివ్య – భరణి మధ్య డిస్కషన్ నడిచింది. “మా అమ్మ వచ్చి స్వయంగా అంత చెప్పాక కూడా మీరు నన్ను ఎందుకు దూరం పెట్టాలి అనుకుంటున్నారు? మా ఫ్యామిలీ తప్ప ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను” అంటూ భరణికి క్లాస్ పీకింది దివ్య. అక్కడితో ఆగిపోలేదు స్టోరీ. నిన్న నైట్ తనూజ కాలు వాపు రావడంతో భరణి మందు రాస్తూ కన్పించాడు అంతే. అది చూసి “మీకే ఒకరు మసాజ్ చేయాలి. మీరు ఇంకొకరికి చేస్తున్నారా?” అంటూ ఇంతెత్తున లేచింది. దీంతో “నాకు చేయాలి అన్పించింది కాబట్టి చేస్తున్నా అని చెప్పవచ్చు కదా మీరు. ఆమె అలా అలిగితే ఎంత హర్టింగ్ గా ఉంటుందో మీకు తెలుసా ? మీరు నా దగ్గరకు వస్తే చాలు అలా ఫీల్ అవుతుంది. దివ్య నేను వద్దని చెప్పాను ఆయనకు” అంటూ ఫైర్ అయ్యింది తనూజా. దీంతో “ఆమె నా దగ్గరకు రాగానే అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు” అని దివ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు భరణి. కానీ దివ్య వింటేగా ? “ఆమె చెప్పిందా అలా అని. అక్కడ నేను అవతలి మనిషిని కాదు, మీ చేయి గాయాన్ని చూశాను. వాళ్ళకు అర్థం కాకపోతే నేనేం చేయలేను” అంటూ ఇచ్చిపడేసింది. ఆ రాత్రి మొదలైన తగవు మరునాడు ఉదయాన్నే కూడా నడిచింది.

స్వీట్ గా ఇచ్చిపడేసిన భరణి కూతురు

Advertisement

ఫ్యామిలీ వీక్ లో భరణి ఫ్యామిలీ నుంచి ఆయన కూతురు హనీ వచ్చి నవ్వుతూనే తండ్రికి వార్నింగ్ ఇచ్చింది. “కమాండ్ చేసే వాళ్ళకు దూరంగా ఉండండి” అని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. ఇక దివ్యాను పిలిచి మరీ తన తండ్రిని చూసుకున్నందుకు థాంక్స్ చెప్పి, కమాండ్ చేయవద్దని నవ్వుతూనే ఇచ్చిపడేసింది హనీ. ‘నాన్నతో మీ బాండ్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాము’ అని తనూజను ఆకాశానికెత్తేసింది. కానీ మరోవైపు దివ్య తల్లి మాత్రం భరణితో బాండ్ కు తానే కారణం అని చెప్పింది. ఏంటో ఈ బాండింగ్ గోల ?! ఇంకా భరణి నలిగిపోతూనే ఉన్నాడు పాపం.  ఇప్పుడేం చేస్తాడో మరి.

Read also : భరణి బాండింగ్స్ పై కూతురు రియాక్షన్… రీతూపై తల్లి కోపం… మదర్ కి కళ్యాణ్ ప్రామిస్

Advertisement

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×