E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : రీతూ పీత బ్రెయిన్ పై బిగ్ బాస్ సెటైర్లు… పాప బైపీసీ అంట పాపం

Bigg Boss 9 Telugu : రీతూ పీత బ్రెయిన్ పై బిగ్ బాస్ సెటైర్లు… పాప బైపీసీ అంట పాపం
Advertisement

Bigg Boss 9 Telugu : ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారా? అంటే అందరూ టక్కున చెప్పే పేరు రీతూ చౌదరి. మొదట్లో చెప్పలేనంత నెగెటివిటీతో హౌస్ లోకి అడుగు పెట్టిన ఆ అమ్మాయి, ఇప్పుడు మాత్రం పాజిటివిటితో రోజురోజుకూ మరింత ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటోంది. తాజాగా మరోసారి టాస్క్ లో బిగ్ బాస్ దగ్గర అడ్డంగా బుక్కయింది రీతూ.

డెమోన్ త్యాగం 

తాజాగా బిగ్ బాస్ టికెట్ ను ఫినాలే కోసం కంటెస్టెంట్స్ కు టాస్క్ లు పెట్టారు. అయితే మొదట్లోనే ఆడబోయే ముగ్గురు ఎవరో డిసైడ్ కావాలని బిగ్ బాస్ ఆదేశించారు. అందరూ డిస్కస్ చేసుకుని కళ్యాణ్, డెమోన్, ఇమ్మూ ఆడతారని చెప్పారు. కానీ అంతలోనే నన్నెవరూ అడగలేదు. నేను కూడా ఆడతా టాస్క్. మీలో మీరు మాట్లాడుకుని డిసైడ్ అయితే సరిపోతుందా?” అంటూ హౌస్ పీకి పందిరేసింది రీతూ. అంతేనా తనుజా, ఇమ్మూ, కళ్యాణ్, భరణిలపై నోరేసుకుని పడిపోయింది. ఆమె దెబ్బకు హౌస్ మొత్తం నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అయితే కళ్యాణ్, ఇమ్మూ త్యాగం చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో, డెమోన్ ను రీతూ కోసం త్యాగం చేయమని తనుజా రిక్వెస్ట్ చేసింది. డెమోన్ కూడా ఎప్పటిలాగే ఆమె కోసం ఛాన్స్ వదులుకున్నాడు.

రీతూతో బిగ్ బాస్ ఆటలు 

Advertisement

మరి ఇంత గొడవ పడి ఛాన్స్ దక్కించుకున్న రీతూ గేమ్ ఎలా ఆడిందో చూస్తే నవ్వాగలేదు. రీతూ, కళ్యాణ్, ఇమ్మూలకు బిగ్ బాస్ కనుక్కోండి చూద్దాం అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో కొన్ని లెక్కల క్వశ్చన్స్ ను కార్డులపై పెట్టారు. బిగ్ బాస్ చెప్పిన ఆన్సర్ కు సంబంధించిన క్వశ్చన్ ను తీసుకొచ్చి, కెమెరాలకు చూపించాలన్నది టాస్క్. ఇందులో రీతూ తెలివితేటలు తేలిపోయాయి. ఆమె ఒక్క పాయింట్ కూడా తెచ్చుకోలేకపోయింది. దీంతో ఏకంగా బిగ్ బాస్ ‘ఇలా ఎలా రీతూ ?’ అంటూ సెటైర్లు వేశాడు. అంతేకాదు ఆమెతో 2 టేబుల్ కూడా చెప్పించాడు. టాస్క్ అయ్యాక చివరికి అక్కడున్న 3 ప్రశ్నలకు రీతూతో చెప్పించమని సంచాలక్ డెమోన్ ను ఆదేశించారు. 18+16, 9÷3, 5×5 చూపించగా… అందులో ఒక్కదానికే రీతూ సమాధానం చెప్పింది. మిగతావి హౌస్ మేట్స్ సహాయంతో చెప్పింది.

అలా రీతూ పీత బ్రెయిన్ తో అందరినీ నవ్వించింది. పైగా ‘నేను బైపీసీ బిగ్ బాస్’ అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. కానీ లెక్కలు చిన్నప్పటి నుంచే ఉంటాయి అని సంజన పంచ్ వేయడంతో, అవును కానీ నాకు తెలిసిన క్వశ్చన్స్ బిగ్ బాస్ అడగలేదు అంటూ బాస్ పైనే తోసేసింది. ఇంత సీరియస్ టాస్క్ లోనూ రీతూ కామెడీతో డే 86 ఎపిసోడ్ లో ఆడియన్స్ హాయిగా నవ్వుకున్నారు.

Advertisement

Read Also : టికెట్ టు ఫినాలే కోసం ‘నాటు నాటు’ టాస్కులు… దుమ్మురేపిన ఇమ్మూ, తనూజా

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×