E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 86 : టికెట్ టు ఫినాలే కోసం ‘నాటు నాటు’ టాస్కులు… దుమ్మురేపిన ఇమ్మూ, తనూజా

Bigg Boss 9 Telugu Day 86 : టికెట్ టు ఫినాలే కోసం ‘నాటు నాటు’ టాస్కులు… దుమ్మురేపిన ఇమ్మూ, తనూజా
Advertisement

Bigg Boss 9 Telugu Day 86 : బిగ్ బాస్ డే 86 ఎపిసోడ్లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లు హీట్ పుట్టించాయి. “ఇంటి సభ్యులు అందరూ ఇన్ని వారాలు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఇక్కడిదాకా వచ్చారు. ఎవరైతే ఈ రణరంగంలో అన్ని గడులు సొంతం చేసుకుంటారో వారు ఈ సీజన్లో మొదటి ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

రీతూ వర్సెస్ తనూజ

“మీలో పోటీ పడే ముగ్గురు ఎవరన్నది చెప్పండి” అని ఆదేశించారు బిగ్ బాస్. అయితే డిస్కషన్ నడుస్తుండగానే ఇమ్ము, కళ్యాణ్, డెమోన్ ముగ్గురూ వెళ్ళనీ అని చెప్పింది తనూజా. కానీ ఫస్ట్ ముగ్గురిలో నేను వెళ్ళాలి అనుకుంటున్నా అని రీతూ అందరినీ రిక్వెస్ట్ చేసింది. కానీ డిస్కషన్ అయిపోయింది. నా నిర్ణయాన్ని మార్చుకోవాలి అనుకోవట్లేదు అని తనూజా చెప్పడం గొడవకు దారి తీసింది. నేను ఆలోచించుకుంటున్నా. మీరంతట మీరుగా వచ్చి ఆ ముగ్గురూ వెళ్తుంటే ఎలా అని ప్రశ్నించింది రీతూ. మాట్లాడాలని ఉంటే అప్పుడే మాట్లాడాల్సింది అని తనూజా ఫైర్ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య హీటింగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. చివరకు రీతూ, కళ్యాణ్, ఇమ్మూకు’కనుక్కోండి చూద్దాం’ అనే ఫస్ట్ టాస్క్ ఆడారు. ఇందులో ఇమ్మూ గెలిచాడు. అప్పటిదాకా నేను ఆడతా అంటూ గొడవ పడిన రీతూ ఒక్క పాయింట్ కూడా గెలుచుకోలేక పోయింది.

సంజనతో ఫస్ట్ టాస్క్ 

Advertisement

ఇమ్మాన్యుయేల్ మీ గడి పక్కనున్న ఏ ఎంప్టీ గడిని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు? మీరు ప్రస్తుతం ఉన్న గడి, మీరు ఎంచుకోబోయే గడి రెండూ మీవి. మీ గదులతో బౌండరీని పంచుకుని ఏ ప్రత్యర్థితో ఆడాలి అనుకుంటున్నారు?” అని బిగ్ బాస్ అడగ్గా… సంజనాతో ఆడాలి అనుకుంటున్నట్టు సమాధానం ఇచ్చాడు ఇమ్మూ. ఇద్దరు కంటెస్టెంట్స్ కు ‘పంతం నీదా నాదా’ అనే టాస్క్ పెట్టారు. ఇందులో తాడును లాగి, ఆపోజిట్ ఉన్న బాక్స్ పైకి వచ్చేలా చేసి, అందులో బాల్ వేయాలి. ఈ టాస్క్ లో సంజన తాడు వదిలేసి ఓడిపోయింది. అలా అనుకోకుండా తాడు వదిలేసి మొదట్లోనే గేమ్ ఓడిపోయినందుకు కన్నీళ్ళు పెట్టుకుంది సంజన.

హౌస్ మేట్స్ అందరూ అద్భుతంగా ఆడావు. ఇకపై నువ్వు గేమ్ ఆడలేదని ఎవ్వరూ నామినేట్ చేయలేరు మిమ్మల్ని. ఇకపై ఒక్కొక్కరూ ఇలాగే గేమ్ నుంచి అవుట్ అవుతూ ఉంటారని నచ్చజెప్పారు. కానీ సంజన మాత్రం ‘నేను ఓడిపోతా అని తెలిసినా నాతో ఆడావు’ అంటూ ఇమ్మూ మొహం మీదే అడిగేసింది. ‘మీకర్థం కావట్లేదు. నేను గెలిస్తే మీరే కాబట్టి ఏమీ కాదు. కానీ ఓడిపోతే ఆ గడులు అన్నీ మీకే వస్తాయి అనే ఆలోచనతోనే ఆడాను” అని వివరణ ఇచ్చాడు. ‘నువ్వు ఓడిపోవులే’ అంటూ ఆ గొడవకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టింది సంజన.

‘నాటు నాటు’ టాస్క్

Advertisement

తొలి ఫైనలిస్ట్ కావడానికి జరుగుతున్న పోటీలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన రెండవ టాస్క్ ‘నాటు నాటు’. ఇందులో ఎవరి కలర్ కు సంబంధించిన ఫ్లవర్స్ ను వాళ్లు తీసుకొచ్చి మట్టిలో నాటాలి. ఇందులో తనూజా, డెమోన్, భరణి ఆడారు. చివరికి తనుజానే విన్ అయ్యింది. నెక్స్ట్ ఆమె సుమన్ తో గేమ్ ఆడతానని చెప్పింది. అయితే గేమ్ ఓడాక.. “వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి ఆడుతున్నారు. పైగా నేనేమన్నా అంటే ఫిజికల్ అయ్యావు అంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు కదా. నెక్స్ట్ చూసుకుంటా’ అని రీతూతో చెప్పాడు డెమోన్. మరోవైపు తనుజా “మనిద్దరం కలిసి ఆడలేదు కదా? ఎంత ఆడినా చివరకు మళ్ళీ సపోర్ట్ అంటారు” అంటూ భరణి దగ్గర క్లారిటీ తీసుకుని, డైరెక్ట్ గా ఆడియన్స్ కు కూడా క్లారిటీ ఇచ్చింది.

Read Also : కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ ఫిట్టింగ్.. రీతూ, తనూజ మధ్య ఫైట్.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు..?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×