South Facing House: వాస్తు శాస్త్రంలో దక్షిణ ముఖ ద్వారం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది దీనిని అశుభంగా భావించినప్పటికీ.. కొందరికి లేదా కొన్ని వృత్తుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దక్షిణ ముఖ ద్వారం సాధారణంగా కొన్ని ప్రత్యేక మైన రాశులు, వృత్తులు, జన్మ సంఖ్యలు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.
1. వృత్తుల వారీగా ప్రయోజనాలు:
దక్షిణ దిశకు అధిపతి కుజుడు (మార్స్), ఇక్కడ శక్తి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి.. ధైర్యం, అధికారం, వేగవంతమైన నిర్ణయాలు అవసరమయ్యే వృత్తుల వారికి ఈ దిశ చాలా ప్రయోజనకరం.
సైనికులు/పోలీస్/భద్రతా అధికారులు: కుజుడు భద్రత, రక్షణకు కారకుడు కాబట్టి.. ఈ వృత్తులలో ఉన్నవారికి శక్తిని, ధైర్యాన్ని, విజయాలను అందిస్తుంది.
రాజకీయ నాయకులు/అధికారంలో ఉన్నవారు: ఈ దిశ నాయకత్వ లక్షణాలను, ప్రజలపై పట్టును పెంచుతుంది.
డాక్టర్లు/సర్జన్లు: ముఖ్యంగా శస్త్ర చికిత్స చేసే వైద్యులకు ఇది అనుకూలమైన శక్తినిస్తుంది.
రియల్ ఎస్టేట్/నిర్మాణ రంగం: ఈ రంగాలలో ఉన్నవారికి స్థిరత్వం, వేగ వంతమైన వృద్ధి, ఆర్థిక లాభాలను చేకూర్చే సామర్థ్యం దక్షిణ దిశకు ఉంటుంది.
క్రీడా కారులు: కుజుడి ప్రభావం వల్ల శారీరక శక్తి, పోటీతత్వం పెరుగుతాయి.
2. జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రం ప్రకారం:
దక్షిణ ముఖ ద్వారం ముఖ్యంగా కింది అంశాలు ఉన్నవారికి శుభ ఫలితాలను ఇస్తుంది.
వృశ్చిక రాశి : కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. ఈ రాశి వారికి దక్షిణ ముఖ ద్వారం అదృష్టాన్ని, శక్తినిస్తుంది.
సంఖ్యా శాస్త్రం :
9వ సంఖ్యలో జన్మించిన వారు (Born on 9th, 18th, or 27th): ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. 9వ సంఖ్య జన్మించిన వ్యక్తులు ఈ దిశలో నివసించడం వల్ల మంచి ఆరోగ్యం, విజయం, స్థిరత్వాన్ని పొందుతారు.
మకర రాశి : దక్షిణ ముఖం యొక్క శక్తిని మకర రాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
3. వాస్తు చిట్కాలతో ప్రయోజనాలు:
దక్షిణ ముఖ ద్వారం ఉన్నప్పటికీ.. వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే, ఎవరైనా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ నియమాలు పాటించాలి.
ద్వార స్థానం: దక్షిణ ముఖ ద్వారం ఎప్పుడూ దక్షిణ-ఆగ్నేయ వైపు కాకుండా.. దక్షిణ దిశలో ఉండే మూడవ లేదా నాల్గవ ‘పదం’ లో ఉండేలా చూసుకోవాలి. ఇది అశుభ శక్తిని తగ్గిస్తుంది.
ఎత్తు, స్థిరత్వం: ఈ దిశలో కాంపౌండ్ వాల్ మిగతా దిశల కంటే ఎత్తుగా ఉండేలా చూసుకోవడం శుభకరం.
Also Read: చిన్న స్థలంలో పెరిగే.. 6 బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్
దక్షిణ ముఖ ద్వారం అనేది అందరికీ కష్టాలను ఇచ్చేది కాదు. సరైన వాస్తు నిబంధనలు పాటించినప్పుడు, ముఖ్యంగా అధికారం, భద్రత, నిర్మాణం, కుజుడి ప్రభావం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప శక్తి, వృత్తి పరమైన విజయాలను అందించే శక్తి వంతమైన దిశగా పనిచేస్తుంది. అయినప్పటికీ.. ఇంట్లో నివసించే వారి జాతకం, వ్యక్తిగత అవసరాల ఆధారంగా వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.