Bigg Boss 9 Kalyan is 1st Finalist: బిగ్ బాస్ తెలుగు ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో షోకుB ఎండ్‌కార్డు పడనుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. ఇందులో నుంచి ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం పక్కా. మిగిలిన ఐదుగురు ఈ సీజన్ టాప్‌లో 5లో నిలవబోతున్నారు. అయితే వారేవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. హౌజ్‌లో ఉన్నవాళ్లంతా టాప్ కంటెస్టెంట్స్. ప్రస్తుతం హౌజ్‌లో టికెట్ టూ ఫినాలే కోసం పోటీ జరుగుతుంది. ఈ టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తనూజ, భరణి, సంజన, డిమోన్ పవన్‌లు అవుట్ అయ్యారు.
ఫైనల్‌గా ఇమ్మాన్యుయేల్, రీతూ, కళ్యాణ్ పడాలు ముగ్గురిలో ఒకరు ఈ రోజు టికెట్ టూ ఫినాలే కప్ గెలవబోతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి మధ్య ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే రేసు మొదలైంది. ఇందుకోసం జరిగిన ఫస్ట్ లెవల్‌లో కట్టు నిలబెట్టు టాస్క్ జరిగింది. ఇందులో ముగ్గురు పోటీ పడి తమకు ఇచ్చిన బ్లాక్స్‌తో టవర్స్ నిర్మించారు. అయితే తమకు సపోర్టు ఇచ్చే వారు ఇతరుల టవర్ పడిపోయేలా చేయాలి. ఈ టాస్క్‌లో తనూజ-కళ్యాణ్‌కి, డిమోన్-రీతూకి సుమన్ శెట్టి న్యూట్రల్‌గా ఆడారు. దీనికి సంబంధించిన ప్రొమో తాజాగా విడులైంది.
అయితే ఇందులో అందరి కంటే కళ్యాణ్ టవరే ఎత్తుగా ఉంది. చూస్తుంటే ఈ టాస్క్‌లో కళ్యాణ్ పడాల గెలిచినట్టు అనిపిస్తుంది. టాస్క్‌ల్లో గెలిచి కళ్యాణ్ డైరెక్టర్ ఫినాలేకు చేరుకోబుతున్నాడని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం.. కళ్యాణ్ పడాల ఈ టాస్క్‌ల్లో గెలిచి టికెట్ టూ ఫినాలే ట్రోఫీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా కళ్యాణ్ పడాల నిలిచనిట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకునేందుకు కళ్యాణ్ మరింత చేరువైనట్టే. మరోవైపు ఈ సీజన్ విన్నర్ గా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని కూడా అందుకునేది కళ్యాణ్ అంటూ గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ టికెట్ టూ ఫినాలే ట్రోఫీ గెలవడంతో బిగ్ బాస్ టైటిల్ కూడా మాదే అంటున్నారు అతడి ఫ్యాన్స్.
Also Read: Singer Mangli: మంగ్లీపై తెలంగాణవాదులు ఆగ్రహం.. బాయిలోనే బల్లిపలికే సాంగ్ ఇక డిలీట్?
మరి ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణా? కాదా? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కాగా ఈ సీజన్‌లో ట్రోఫీ గెలిచేవారిలో తనూజ-కళ్యాణ్ పడాలలో ఒకరని తెలుస్తోంది. బయట వీరిద్దరికి ఓటీంగ్ నువ్వా-నేనా అన్నట్టు ఉంది. హౌజ్ లో మంచి స్నేహితులు వీరు.. బయటకు ఓటింగ్ లో మాత్రం గట్టి పోటీ పడుతున్నారు. ఇద్దరి పోటా పోటిగా ఓట్స్ పడుతున్నాయట. ఇక ఆ తర్వాత విన్నింగ్ రేస్‌లో ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆట తీరు, ఓట్ల ప్రకారం చూస్తే ఈ సీజన్ టాప్ 5లో కళ్యాణ్ తర్వాత తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, ఆ తర్వాత రీతూ లేదా భరణి ఉండేలా కనిపిస్తున్నారు.