E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : రన్నరప్ తనూజా… చివరి నిమిషంలో ఓడిపోవడానికి కారణాలు ఇవే

Bigg Boss 9 Telugu : రన్నరప్ తనూజా… చివరి నిమిషంలో ఓడిపోవడానికి కారణాలు ఇవే
Advertisement

Bigg Boss 9 Telugu Grand Finale : బిగ్ బాస్ సీజన్ 9 చివరి దాకా ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్ చుట్టూ తిరిగింది. ప్రేమ, అలక, టాస్క్ లు, గొడవలు… ఇలా సంతోషం నుంచి దుఖం వరకూ ఏమొచ్చినా ఈ సీజన్లో మారు మ్రోగిన ఒకే ఒక్క పేరు తనూజ. ‘ముద్ద మందారం’ సీరియల్ తో ప్రతీ తెలుగింటి ఆడపిల్లగా మారిన తనూజ ఈ సీజన్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక్క సెలబ్రిటీ. ఎన్నో దాటుకుని సీజన్ 9లో చివరిదాకా వచ్చిన ఈ లేడీ సింగం ఓటమికి కారణాలు ఏంటో తెలుసా ?

సీజన్ 9లో లేడీ సింగం 

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ అడుగు పెట్టింది మొదలు మొదలైంది నెగెటివిటీ. హోస్ట్ నాగార్జున ఏ ముహూర్తన అన్నపూర్ణ స్టూడియో ప్రాడక్ట్ తనూజ అంటూ స్టేజ్ పై పరిచయం చేశారో అదే శాపంగా మారింది ఈ అమ్మాయికి. ఏకంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ సగం సీజన్ ఆమె మీద నెగెటివిటీతోనే సరిపోయింది. అది చాలదన్నట్టు బాండింగ్ బరువు, అందరూ ఆమెనే టార్గెట్ చేయడం, ఫ్రెండ్ అనుకున్న ఇమ్మూతో గొడవలు, కళ్యాణ్ తో లవ్ ట్రాక్ వివాదం… ఇవి చాలదన్నట్టు హౌస్ లో ఒంటరి. అందని ద్రాక్షలా మారిన కెప్టెన్సీ. కదిలిస్తే తన్నుకొచ్చే ఏడుపు. ఇవన్నీ దాటుకుని టాప్ 2లోకి అడుగు పెట్టింది తనూజ. ఇక ఈసారి విన్నర్ తనూజ అని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తనూజ ను బ్యాడ్ లక్ వరించింది. ఆమె ఎప్పుడూ చెబుతూ వచ్చినట్టే, ఆఖరి దాకా వచ్చి ఆగిపోయింది అదృష్టం. ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో రన్నరప్ గా నిలిచింది తనూజ.

శ్రీసత్య, యష్మీ షాకింగ్ కామెంట్స్ 

Advertisement

మరి ఇంత కష్టపడిన తనూజ ఓటమికి కారణం ఏంటంటే? ఆమెతో కలిసి పని చేసిన తోటి నటీనటులే. నిజానికి లోపల తనూజ – కళ్యాణ్ ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా ఉన్నారు. పైగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. కానీ కళ్యాణ్ పీఆర్ మాత్రం సందర్భం దొరికినప్పుడల్లా తనూజను బ్యాడ్ చేశారు. అంతేనా కళ్యాణ్ – తనూజ లవ్ ట్రాక్ అంటూ వీడియోలు వైరల్ చేశారు. ఇక బయట ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది మాత్రం కావాలనే తనూజను నెగెటివ్ చేశారు. వాళ్ళు ఎవరో కాదు తనూజ తోటి సీరియల్ నటి శ్రీసత్య, నటి – ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ యష్మి గౌడ. రీసెంట్ గా లైవ్ లో మాట్లాడుతూ ‘మీరు తనూజను చూసి జెలసీ’ ఫీల్ అవుతున్నారు’ అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చారు. జెలసీ అంటే మీరు బయట వాళ్ళ గురించి చూడనిది మేము చూశాము అని చెప్పారు. ఓపెన్ గా కళ్యాణ్ కే తమ సపోర్ట్ అని కుండబద్ధలు కొట్టారు. అలా ఆమెకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే నెగెటివ్ చేయడం అన్నది తనూజకు చివరి నిమిషంలో ఓటింగ్ ఛేంజ్ అవ్వడానికి కారణం అయ్యింది.

Read Also : ఇమ్మూను దెబ్బ కొట్టిన బ్యాడ్ సెంటిమెంట్… రోగ్ రోబోతో ఫెంటాస్టిక్ ఫోర్ గా ఎలిమినేట్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×