YS Jagan Birthday: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు నేడు. ఆదివారం (డిసెంబర్ 21) ఈ ఆయనకు పుట్టిన రోజు కావడంతో వైసీపీ నేతలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా ఏపీ, తెలంగాణలోని వైసీపీ నేతలు ఆయన పుట్టిన రోజును వేడుకగా జరుపుకుంటున్నారు. అలాగే విజయనగరంలోని చిపురిపల్లిలో డాక్టర్ బొత్స అనూష అధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి అక్కడ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ ఇందులో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. “మాట ఇస్తే మడమ తిప్పని నేతగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేద ప్రజలకు అండగా నిలిచారు. బలహీన వర్గాలకు విస్తృతంగా సంక్షేమ పథకాలు అందించి, మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని” పేర్కొన్నారు.
మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులకు ప్రజల కష్టాలు పట్టడం లేదు. జగన్ గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేకనే కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించి పేదవాడి నోటి దగ్గర కూడును లాగేసుకుంటున్నారు,” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులకు ప్రజల కష్టాలు పట్టడం లేదు. జగన్ గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేకనే కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించి పేదవాడి నోటి దగ్గర కూడును లాగేసుకుంటున్నారు,” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అనంతరం డాక్టర్ బొత్స సందీప్ మాట్లాడుతూ.. “యువతకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదర్శప్రాయులు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. నిరుపేద కుటుంబాలను పలకరిస్తే మళ్లీ జగనన్నే సీఎం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నానని” అన్నారు.
ఆ తర్వాత బొత్స అనూష మాట్లాడుతూ… “జగన్ గారి జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. రక్తదాన శిబిరానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లడం సంతోషాన్నిచ్చింది. మళ్లీ జగనన్న అధికారంలోకి వచ్చి, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలు భగవంతుడిని ప్రార్థిస్తున్నారని” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంత చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ బొత్స అనూష ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణకు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్, డాక్టర్ బొత్స సందీప్ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, పోట్నూరి సన్యాసి నాయుడు, అప్పల నాయుడు గార్లకు ఇతర పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.