E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : కప్పు కొట్టేసిన కామనర్ కళ్యాణ్… ప్రైజ్ మనీ 50 లక్షలు కాదు… విన్నర్ కు దక్కేవి ఇవే

Bigg Boss 9 Telugu : కప్పు కొట్టేసిన కామనర్ కళ్యాణ్… ప్రైజ్ మనీ 50 లక్షలు కాదు… విన్నర్ కు దక్కేవి ఇవే
Advertisement

Bigg Boss 9 Telugu Winner Kalyan Padala : కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి, తన ఖతర్నాక్ ఆటతో దుమ్మురేపాడు సోల్జర్ కళ్యాణ్ పడాల. ఏకంగా సీజన్ 9 విన్నర్ గా గెలిచి, బిగ్ బాస్ చరిత్రను తిరగరాశాడు. మరి ఇంతకీ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఎంత ? అలాగే ఇంకా ఏమేం అందుకున్నాడు కళ్యాణ్ ? అనే వివరాల్లోకి వెళ్తే…

కామనర్ గా వచ్చి కప్పు 

అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 9కు సెలెక్ట్ అయిన ఆరుగురు కామనర్స్ లో కళ్యాణ్ పడాల ఒకడు. జవాన్ గా తన జాబ్ ను వదులుకుని, సినిమాల మీద ఇష్టంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదటి రెండు వారాల్లోనే ఆట కంపించక పోవడంతో అతను ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మూడవ వారం నుంచి తన ఆటలో మార్పులు, చేర్పులు చేసుకుని స్టార్ తో పాటు కెప్టెన్సీని కూడా కొట్టేశాడు. రమ్య, మాధురి వంటి కంటెస్టెంట్స్ కళ్యాణ్ ఆడవాళ్ళ పిచ్చోడు అని ముద్ర వేసినా, దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన వల్ల తనూజ ఇబ్బంది పడుతోందని విమర్శించిన నోళ్ళను మూయించాడు. అదే తనూజతో తాను ఎలాంటి వాడో చెప్పించాడు. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ టాప్ 5కి వచ్చాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతూ, అమ్మానాన్న ప్రేమను పొందలేకపోయాను అనే ఎమోషన్ తో తెలుగు ప్రేక్షకులలో ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఒకరు ఉండాలని కోరుకునే రేంజ్ కి ఎదిగాడు. అటు తనూజ సపోర్ట్, ఇటు అన్న ఇమ్మూతో కలిసి టాప్ 2కి చేరుకున్నాడు. చివరికి రెండవ కెప్టెన్ గా కూడా సత్తా చాటి, తల్లి కోరికను నెరవేర్చాడు. చివరికి కప్పు కొట్టే రేంజ్ కి ఎదిగాడు.

ప్రైజ్ మనీ 50 లక్షలు కాదు 

Advertisement

అప్పటిదాకా ఈసారి లేడీ విన్నర్ గా తనూజ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ పీఆర్ స్టంట్స్, మంచి బిహేవియర్ తో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు కళ్యాణ్. అలాగే టాప్ 2లో నిలిచి, తనకు ఇష్టమైన తనూజతోనే ట్రోఫీ కోసం పోటీ పడ్డాడు. ఇక విన్నర్ అయిన కళ్యాణ్ కు ముందు చెప్పినట్టుగా 50 లక్షలు కాదు 35 లక్షలే వస్తాయి. ఎందుకంటే డెమోన్ ప్రైజ్ మనీలో నుంచి 15 లక్షల డీల్ తో బయటకు వెళ్ళాడు. అందులోనూ 30 శాతం గవర్నమెంట్ ట్యాక్స్ లు కూడా కట్ చేస్తారు. కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 కప్పుతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ విత్ ట్యాక్స్ కటింగ్స్, రెమ్యూనరేషన్, అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్ అనే కారు కూడా గిఫ్ట్ గా అందుకున్నాడు.

Read also : విన్నర్ రేస్ నుంచి తప్పుకున్న డెమోన్… సూట్ కేస్ తో బయటకు… ఇంటికి ఎన్ని లక్షలు పట్టుకెళ్ళాడో తెలుసా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×