E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : విన్నర్ రేస్ నుంచి తప్పుకున్న డెమోన్… సూట్ కేస్ తో బయటకు… ఇంటికి ఎన్ని లక్షలు పట్టుకెళ్ళాడో తెలుసా?

Bigg Boss 9 Telugu : విన్నర్ రేస్ నుంచి తప్పుకున్న డెమోన్… సూట్ కేస్ తో బయటకు… ఇంటికి ఎన్ని లక్షలు పట్టుకెళ్ళాడో తెలుసా?
Advertisement

Bigg Boss 9 Telugu Grand Finale : బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరుగుతోంది. సెలబ్రిటీల రాకతో బిగ్ బాస్ వేదిక దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే విన్నర్ ఎవరనే కుతూహలం పెరిగిపోయింది. అయితే అంతకంటే ముందే టాప్ ఫైవ్ లో ఉన్న ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చారు. అందులో సంజన, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. ఇమ్మూ టాప్ 4 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఇది ఇమ్మూ అభిమానులకు షాకిచ్చే విషయమే. అయితే టాప్ 3లో మాత్రం కామనర్ డెమోన్ పవన్ ఉండడం మరో సర్ప్రైజ్.

కామనర్ నుంచి ఖతర్నాక్ జర్నీ

మొదటి రెండు మూడు వారాల్లో మెతగ్గా కనిపించిన డెమోన్ అసలు హౌస్ లో ఉండగలడా ?, మిగతా వాళ్ళను తట్టుకుని నిలబడగలడా ? అనే డౌట్ నెలకొంది. కానీ రీతూతో అతని లవ్ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయింది. ముందుగా వీళ్ళిద్దరి చిలిపి చేష్టలు, చిర్రుబుర్రులాటలు చూసి ఆడియన్స్ తెగ చిరాకు పడ్డారు. నిబ్బా నిబ్బి వేషాలు చూడలేకపోతున్నామంటూ విమర్శలు గుప్పించారు. కానీ రాను రానూ వీరిద్దరి లవ్ ట్రాక్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఫలితంగా రీతూతో పాటు డెమోన్  కూడా టాప్ 7 వరకు చేరుకున్నారు. కానీ రీతూపై మాన్ హ్యాండ్లింగ్ చేశాడన్న రీజన్ తో డెమోన్ కు మధ్యలోనే గేట్లు ఓపెన్ చేసి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. మోకాళ్లపై కూర్చుని మరీ సారీ చెప్పిన డెమోన్… రీతూ వెళ్ళిపోయాక తన ఆట తీరును కంప్లీట్ గా ఛేంజ్ చేసి విధ్వంసం సృష్టించాడు. డెమోన్ తో ఆట ఆడాలంటే ఇతర కంటెస్టెంట్స్ వణికిపోయే రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఫలితంగా టాప్ 5కి చేరుకున్నాడు.

సూట్ కేసు తీసుకుని తెలివైన నిర్ణయం 

Advertisement

ఇక ఆ తర్వాత జరిగింది మాత్రం ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటింగ్లో లీస్ట్ లో ఉన్న డెమోన్ కు గత కొన్ని రోజుల నుంచి ఓట్ల వర్షం కురుస్తుంది. అతనిలోని కామెడీ యాంగిల్ బయటపడడం, మంచితనం చూసి జనాలు పవన్ వైపు అట్రాక్ట్ అయ్యారు. ఫలితంగా మిస్డ్ కాల్స్ వరదలా ముంచుకు రావడంతో డెమోన్ టాప్ 3కి చేరుకున్నాడు. ఇక టాప్ 3లో ఉంటాడనుకున్న ఇమ్మూ బయటకు వెళ్లగా, డెమోన్ మాత్రం సూట్కేస్ తో సంతోషంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు. మాస్ మహారాజా రవితేజ హీరోయిన్లు డింపుల్, ఆషికా రంగనాథన్ లతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా వచ్చారు. రవితేజ సిల్వర్ సూట్ కేసులో 5 లక్షలతో హౌస్ లోకి వెళ్ళాడు. ఆ తరువాత అమౌంట్ ను 7.5 నుంచి నెమ్మదిగా 15 లక్షలకు పెంచడంతో, డెమోన్ ను కన్విన్స్ అయ్యి బయటకు వచ్చాడు. తనకు ఓటు చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పి, ఫ్యామిలీకి నీడ్ ఉందంటూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సారీ కూడా చెప్పాడు. టాప్ 3లో ఉన్నట్టు అతనే ఉన్నట్టు రవితేజ రివీల్ చేశాడు. సిల్వర్ బ్రీఫ్ కేసు రూపంలో డెమోన్ రైట్ డెసిషన్ తీసుకున్నాడు.

Read Also : రన్నరప్ తనూజా… చివరి నిమిషంలో ఓడిపోవడానికి కారణాలు ఇవే

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×