E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనుజకు అభిజిత్ తో పోలికా? ఆన్లైన్ రివ్యూస్ చూసి వచ్చావా హారిక?

Bigg Boss 9 Telugu : తనుజకు అభిజిత్ తో పోలికా? ఆన్లైన్ రివ్యూస్ చూసి వచ్చావా హారిక?
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 నామినేషన్స్ రోజు ఆసక్తి కలిగిస్తే, మిగతా రోజులు మాత్రం సో సో గా అనిపిస్తుంది. హౌస్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అంటే ఖచ్చితంగా ఇమ్మానుయేల్ మరియు సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తాయి. వాళ్లు గేమ్ ఆడే విధానం కొన్ని విషయాల్లో మాట్లాడే విధానం ఇవన్నీ కూడా కొంతమందిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే గేమ్ మాత్రమే హౌస్ లో ఆడితే సరిపోదు హౌస్ బయట మేనేజ్ చేయాల్సినవి చాలా ఉంటాయి. వీటన్నిటినీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసింది తనుజ.

తనుజాకి ఉన్న పి ఆర్ చూస్తే చాలామంది ఆశ్చర్య పోవాల్సిందే. చిన్న చిన్న విషయాలను కూడా తనకు అనుకూలంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కేవలం ఇది సోషల్ మీడియాలోని వైరల్ అవ్వడం కాకుండా, హౌస్ నుంచి బయటకు వచ్చిన కొంత మంది తనుజాకి ఎటువంటి సపోర్ట్ హౌస్ లో ఉంటుందో బయటకు కూడా చెప్పారు.

Advertisement

రమ్య మోక్ష కంప్లీట్ గా తనుజ గురించి బయట పెట్టింది. అయితే హౌస్ లో ఉన్నప్పుడే ఈ విషయాలు బయట పెట్టింది రమ్య మరుక్షణమే హౌస్ నుంచి బయటికి వెళ్లి పోవలసిన పరిస్థితి. మరోవైపు దమ్ము శ్రీజ కూడా తనుజ గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది.

తనుజకు అభిజిత్ తో పోలికా?

అన్ని సీజన్స్ ప్రస్తావన వస్తే కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం విపరీతమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. వాళ్లకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలా మంచి పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో అభిజిత్ ఒకరు. అభిజిత్ మాట్లాడే విధానం గేమ్ ఆడే విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది.

Advertisement

అయితే హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సుమన్ శెట్టితో గేమ్స్ ఆడింది. మొత్తానికి ఆ టాస్క్ లో హారిక గెలిచింది. అయితే హౌస్ మేట్స్ మీద వాళ్లకు ఉన్న అభిప్రాయం చెప్పడం అనేది కామన్ గా జరుగుతుంది.

ఈ తరుణంలో తనుజ గురించి మాట్లాడింది హారిక. తనుజ గారు మీ గేమ్ గురించి చెప్పాలి అంటే నా సీజన్లో నేను ఆడిన బెస్ట్ ఫ్రెండ్ తో పోల్చి చెప్పాలి పేరు చెప్పకూడదు అంటూ కవర్ చేసింది. ఇంకా హారిక ఆడిన సీజన్లో బెస్ట్ అంటే అభిజిత్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తనుజను అభిజిత్ తో పోల్చడం అనేది చాలామందికి జీర్ణించుకోలేని విషయం. తనుజ అభిమానులకు ఎలివేషన్ పాయింట్.

ఆన్లైన్ రివ్యూస్ చూసి వచ్చావా? 

హారిక ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో హారికను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఏ యాంగిల్ లో నీకు అభిజిత్ లా గేమ్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ మధ్య చాలా తేడా ఉంది. ఆన్లైన్లో కొంతమంది పెయిడ్ రివ్యూస్ చూసి వచ్చి చెప్పావా అంటూ హారికను చాలామంది టార్గెట్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు.

Also Read: Bhagyashree Borse : వాళ్లతో కలిసి పని చేయాలని ఉంది, భాగ్యశ్రీ కోరిక నెరవేరుతుందా?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×