E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : సోహెల్ ఇజ్జత్ తీసిన బిగ్ బాస్..ఇంత కక్కుర్తి ఏంటి భయ్యా.. రచ్చ రచ్చే..

Bigg Boss 9 Telugu Promo : సోహెల్ ఇజ్జత్ తీసిన బిగ్ బాస్..ఇంత కక్కుర్తి ఏంటి భయ్యా.. రచ్చ రచ్చే..

Bigg Boss 9 Telugu Promo : తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 కు శుభం కార్డు పడబోతుంది.. ఈ క్రమంలో ఈ వారంలోని ప్రతి ఎపిసోడ్కి గత సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారంతా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియాంక జైన్, మానస్, ప్రేరణలు హౌస్ మేట్స్ తో కలిసి సందడి చేశారు. ఇక ఇవాళ ఎపిసోడ్ కు కూడా పాత కంటెస్టెంట్ వస్తారని  ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రోమోను బిగ్ బాస్ కొన్ని నిముషాల క్రితం విడుదల చేశారు. ఆ ప్రోమోలో సోహెల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరితో సరదాగా గడిపినట్లు కనిపిస్తుంది. మొత్తానికి ప్రోమో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

ఫుడ్ కోసం సోహెల్ ను రిక్వెస్ట్.. 

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతుంది. 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 12 వ వారంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టింది. ఈవారం నామినేషన్ ప్రక్రియ కాస్త వాడీ వేడిగా జరిగింది.. హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఇప్పుడు జనాల్లో చర్చగా మారింది.. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ గత సీజన్లలో స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్లను మళ్ళీ హౌస్ లోకి దింపుతున్నాడు. ఇప్పటికే చాలామంది హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ తో సరదాగా గడిపారు. తాజాగా బిగ్ బాస్ బెస్ట్ కంటెస్టెంట్ సోహెల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాల్టి ఎపిసోడ్లో ఆయన ఎంట్రీ ఉండబోతుందని ప్రోమో ని చూస్తే తెలుస్తుంది. సోహెల్ రావడంతోనే హౌస్మెట్స్ అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. హౌస్ లోని వాళ్లంతా చికెన్ కోసం రిక్వెస్ట్ చేశారు. సోహెల్ బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేస్తాడు.. వాళ్ల కోరికను సోహెల్ తీరుస్తాడు. ప్రోమోలో ఈ సీను హైలెట్గా నిలిచింది.. ఇది చూసిన జనాలు ఫుడ్ కోసం ఇంత కక్కుర్తి పడుతున్నారే అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :‘ఆంధ్రా కింగ్ తాలూకా ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సోహెల్ పరువు తీసేసిన బిగ్ బాస్.. 

బిగ్ బాస్ సీజన్ 3 లో ఫైర్, ఎమోషనల్ డైలాగులు, చిచ్చర పిడుగు లాగా ప్రతి టాస్క్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు సోహెల్.. హౌస్ లో ఉన్నన్ని రోజులు సో హెల్ తన ఆటతీరుతో మాట తీరుతో జనాలను బాగా ఆకట్టుకున్నాడు. అతను మళ్లీ హౌస్ లోకి రావడంతోనే హౌస్మెట్స్ లో ఫుల్ జోష్ నింపేశాడు.. ప్రోమో విషయానికి వస్తే.. సోహెల్ రాగానే అందరిని నవ్వించాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా పాల ప్యాకెట్లు,కాఫీ పొడి, చికెన్ కావాలని అడుగుతారు.. చికెన్ లేకుండా మీరు ఇన్ని రోజులుగా హౌస్ లో ఉన్నారా..? నేను అయితే అటు పక్క గోడ దూకేసి ఎప్పుడో వెళ్లిపోయే వాడినని సోహెల్ అంటాడు. ఆ తర్వాత మాకు చికెన్ కావాలి అని అడగ్గానే సోహెల్ అక్కడున్న కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఇది కాస్త ఫన్నీగా అనిపిస్తుంది.. ఒకసారి అడిగితే అతను అడిగిన దానికి పేపర్లను పంపిస్తాడు. బిగ్ బాస్ ప్లీజ్ నా ఇజ్జత్ తీయొద్దు అనేసి రిక్వెస్ట్ చేసిన సోహెల్  మొత్తానికి చికెన్, పాలు, కాఫీ పొడిని తెప్పిస్తాడు.. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరితో కలిసి చికెన్ చికెన్ డిన్నర్ డిన్నర్ అంటూ డాన్స్ వేస్తాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ ప్రోమో ని చూస్తుంటే ఎపిసోడ్ మొత్తం సరదాగా ఉంటుందని తెలుస్తుంది.. సోహెల్ హౌస్ లోని వాళ్లతో ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే ఇవాళ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×