E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo: భరణి అవుట్.. తనూజ కోసం త్యాగం.. లీడర్ బోర్డులో స్కోర్ కోసం పోరు..

Bigg Boss 9 Telugu Promo: భరణి అవుట్.. తనూజ కోసం త్యాగం.. లీడర్ బోర్డులో స్కోర్ కోసం పోరు..
Advertisement

Bigg Boss 9Telugu Promo: తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది.. 14వ వారంలోకి అడుగుపెట్టిన ఈ షో ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది.. ఈవారం నామినేషన్స్ కు బదులుగా లీడర్ బోర్డులో స్కోర్ పెట్టి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేశాడు బిగ్ బాస్.. సోమవారం నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఒక టాస్క్ తో హౌస్ మేట్స్ మధ్య గట్టి పోటీని పెట్టాడు బిగ్ బాస్. లీడర్ బోర్డులో స్కోర్ కోసం కంటెస్టెంట్లు బాగానే కష్టపడ్డారు.. ఎక్కువ స్కోర్ చేయకపోవడంతో నిన్న ఎపిసోడ్లో సుమన్ శెట్టి, ఇవాళ పోరు నుంచి మరొకరు తప్పుకున్నారు. తాజాగా ఇవాల్టీ ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

పోరు నుంచి భరణి అవుట్..

శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమోలో.. భరణి తక్కువ స్కోర్ ని పొందిన కారణంగా పోటీ నుంచి తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్తాడు. అయితే మీరు ఇప్పటివరకు సంపాదించిన స్కోర్ ని హౌస్ లో ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడుగుతాడు. భరణి వెంటనే నా స్కోర్ మొత్తాన్ని తనుజాకి ఇవ్వాలనుకుంటున్నాను బిగ్ బాస్ అని ఎమోషనల్ అవుతాడు. ఆ మాట వినగానే తనూజ భరణి దగ్గరికి వెళ్తుంది. కాసేపు హౌస్ మేట్స్ మొత్తం భరణి కోసం ఎమోషనల్ అవుతారు.. ఈ స్కోర్ నామినేషన్స్ నుంచి తప్పిస్తుందని బిగ్ బాస్ అన్నాడు. కాబట్టి పోరు నుంచి తప్పుకున్న ఈ ఇద్దరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారా? లేదా అన్నది వీకెండ్ ఎపిసోడ్ లో చూడాల్సిందే..

Advertisement

Also Read: క్యాన్సర్ తో పోరాడుతున్న నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్..

కీ టు సక్సెస్.. కొట్టుకున్న కంటెస్టెంట్స్.. 

భరణి పోటి నుంచి తప్పుకున్న తర్వాత బిగ్ బాస్ మిగిలిన ఐదుగురికి టాస్క్ ను ఇస్తాడు. టాస్క్ పేరు కీ టు సక్సెస్.. స్విమ్మింగ్ పూల్ లో కొన్ని షేప్ లో ఉన్న షీట్లను పెడతారు. పూల్ లోకి దిగిన కంటెస్టెంట్లు వాటికి ఉన్న తాళాలను తీసి ఆ షీట్లను తీసుకువచ్చి అక్కడ ఎదురుగా ఉన్న బోర్డులో పెట్టాలి. ఈ టాస్క్ ఇమ్మానుయేల్, తనూజ, సంజన ముగ్గురు పోటీ పడతారు. ముందుగా ఇమ్మానుయేల్ తన షీట్లను తీసుకొని వచ్చి బోర్డులో పెడతాడు.. ఆ తర్వాత సంజన కూడా తాళాలను తీసి షీట్లను బోర్డులో పెడుతుంది. తనుజ వీళ్ళిద్దరికీ గట్టి పోటీనిస్తూ తాళాలను తీసి షీట్లను బోర్డులో పెడుతుంది.. అందరికన్నా ఎక్కువగా ఇమ్ము ఆ బోర్డులో షీట్లను పెడతాడు. అయితే మరికొన్ని షీట్లను తీసుకురావాల్సి ఉంది. కానీ బోర్డులో షీట్లను కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పిన విషయాన్ని డిమాన్ గుర్తు చేస్తాడు. దాంతో ముగ్గురు కూడా కొట్టుకునే వరకు వెళ్తారు. తమ షీట్లని బోర్డులో ఉంచుకునేందుకు పెద్ద కుస్తీనే పడతారు.. మొత్తానికి ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఈ పోటీలో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అన్నది ఇవాళ ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×