Bigg Boss 9 Telugu New Captain: ఫ్యామిలీ వీక్ ముంగింపుకు వచ్చేసింది. ఇప్పటివరకు తనూజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య, రీతూ, డిమోన్ పవన్, కళ్యాణ్‌ల ఫ్యామిలీ వచ్చి వెళ్లాయి. చివరిగా ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ హౌజ్‌లోకి రానుంది. ఇమ్మాన్యుయేల్ తల్లి హౌజ్ లో అడుగుపెట్టిన ప్రోమో కాసేపటి క్రితం విడుదలైంది. తల్లి రాక టాస్క్‌ల వీరుడు, ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ కన్నీళ్లు పెట్టాడుకున్నాడు. ఈ ప్రొమో బాగా ఆకట్టుకుంది. అలా ఈ వారమంత బిగ్ బాస్ కుటుంబ సభ్యుల రాకతో ఎమోషనల్ రైడ్ గా సాగింది. ఈ రోజు ఫైనల్ గా ఇమ్మాన్యుయేల్ తల్లి ఎంట్రీ ఫ్యామిలీ విక్ ముగియనుంది. ఆ తర్వాత నేడు కెప్టెన్సీ టాస్క్ కి పోటీ జరగనుంది.
దీని కోసం హౌజ్ మేట్స్ ని రెండు టీంలుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. రీతూ, డిమోన్, తనూజ, కళ్యాణ్, సుమన్ ఒక టీం, భరణి, దివ్య, ఇమ్మాన్యుయేల్, సంజన ఒక టీంగా డివైడ్ అయిపోయారు. వీరిద్దరు బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం పెట్టిన టాస్క్ లు టఫ్ గా సాగాయి. రెండు టీంలో మధ్య హోరాహోరి పోటీ జరిగింది. ఫైనల్‌గా భరణి, రీతూ మధ్య పోటీ జరగ్గా.. వీరద్దరి రీలూ గెలిచి పదకొండవ వారం కెప్టెన్ అయ్యింది. ఫైనల్ గా రీతూ డ్రీం ఫుల్‌ఫిల్ అయ్యింది. మొదట లవ్ ట్రాక్స్‌తో రీతూ నెగిటివిటీ తెచ్చుకుంది. డిమోన్, కళ్యాణ్ లతో మొదట చనువుగా కనిపించడంతో రీతూకి వ్యతిరేకత పెరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ పక్కకు జరగడంతో రీతూ, డిమోన్ బాండింగ్ మరింత బలపడింది. వైల్డ్ కార్డ్ గా వచ్చి న రమ్య మోక్ష ఎంట్రీతో రీతూ, డిమోన్ రిలేషన్ పై హౌజ్‌లోనే కాదు ఆడియన్స్ కి కూడా ఓ క్లారిటీ వచ్చింది.
ఆ తర్వాత డిమోన్ కోసం ఎన్నోసందర్భాల్లో రీతూ స్టాండ్ తీసుకోవడం, అలాగే రోజు రోజుకి తన ఆట మెరుగుపరుచుకుంటూ ఆడియన్స్ మనసు దొచుకుంది. దీంతో రీతూ ఫుల్ పాజిటివిటీ పెరిగడంతో టాప్ 5 కంటెస్టెంట్ తో ఒకరుగా ఉంది. అలాగే టాస్క్ ల్లోనూ టఫ్ కాంపిటిషన్ ఇస్తుంది. గత కొన్ని వారాలు కెప్టెన్సీలో ఫైనల్ వరకు వెళ్లి ఒక్క అడుగు దూరంలో చేజార్చుకుంటున్న రీతూ పదకొండవ వారంలో స్వయంగా గెలిచి కెప్టెన్ అయ్యింది. ఇక ఈ వారం బయటకు వెళ్లేవారిలో మొత్తం ఆరుగు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా లు పదకొండవ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లేవారి జాబితాలో ఉన్నారు.
వీరికి సోమవారం నుంచే ఒటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి సారి ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్‌లోకి రావడంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ జోరు చూపిస్తున్నారు. అతడికి వరుసగా ఓట్స్ గుద్దడమే కాదు.. మీస్డ్ కాల్స్ కూడా కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ ఓటింగ్లో కళ్యాణ్ టాప్ లో ఉండగా.. ఆ నెక్ట్స్ ఇమ్మాన్యుయేల్ ఉన్నాడట. ఇద్దరి ఓటింగ్ లో పెద్దగా లేడా లేదు. ఆ తర్వాత స్థానాల్లో డిమోన్, భరణి శంకర్లు ఉన్నారు. చివరిగా దివ్య, సంజనలు ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ జాబితాలో వీరిద్దరు డెంజర్ జోన్ లో ఉన్నారట. వీరిద్దరి మధ్య ఓటింగ్‌లో పెద్దగా తేడా లేకపోవడంతో ఈ ఇద్దరిలో ఎవరోకరు ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా దివ్య బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి ఈ పదకొండవ వారంలో హౌజ్ నుంచి బయటకు వెళ్లేదేవరో తెలియలాంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.