Weather Alert: తెలంగాణలో మరో వారం రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది . సెప్టెంబర్ 15న అల్పపీడన ప్రాంతం బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా మారిందని తెలిపింది.
తెలంగాణలో ఈ జిల్లాలకు అలర్ట్..
తెలంగాణకు ఆనుకొని తూర్పు విధర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని.. దీంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఆ రెండు రోజులు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు..
అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వారు వెల్లడించారు. బుధ, గురువారాల్లో సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
ఏపీలో వాతావరణ ఇలా..
ఏపీకి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మంగళవారం రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై చర్చలు సఫలం
పలు జాగ్రత్తలు..
భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. అంతేకాకుండా చిన్న పిల్లలను, వృద్ధులను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.