Illu Illalu Pillalu Today Episode September 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి సంతోషంతో ఉప్పొంగుతూ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అత్తయ్య అని అంటుంది.. ఐదు మంది పిల్లల్ని కన్నాను నాకు ఆ మాత్రం తెలీదా నువ్వు తల్లి కాబోతున్నావు కదా అని అంటుంది ఆ మాట చాటుగా విన్నా శ్రీవల్లి టెన్షన్ గుండెలు బాదుకుంటుంది. ఆ విషయం కాదు నాకు ప్రమోషన్ వచ్చిందన్న విషయం చెప్పాలనుకుంటే మీరేంటి ఇలా మారారు అని అనుకుంటుంది. అయితే ఈ విషయాన్ని మనం ప్రేమతో వెళ్లి చెప్పాలి అని వేదవతి అంటుంది. ప్రేమ ఇంట్లో కనిపించక పోవడంతో రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అత్త కోడలు.. శ్రీవల్లి ఇద్దరినీ తల్లిదండ్రులని కూడా చూడకుండా కొడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భాగ్యం ఏం చేయాలో నాకు తెలుసు అలానే చేస్తాను అని వెళ్ళిపోతారు.. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ ఒంటరిగా నడుచుకుంటూ వస్తోంది. ప్రేమ నా కున్నది ఒకటే దారి ఆ కళ్యాణ్ చెప్పినట్టు వాడి కోరిక తీర్చాలని అనుకుంటుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్లాలి అని ప్రేమ వెన్నపోతుంటే ధీరజ్ నువ్వు ఎక్కడికైనా చెప్పు నేను డ్రాప్ చేస్తానని అంటాడు.. ఎక్కడికి వద్దు నేను వెళ్తాను అని ప్రేమ ఎంత చెప్పినా సరే ఈరోజు మాత్రం మాట వినకుండా నేను నిన్ను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కువ అని అంటారు. కళ్యాణ్ రమ్మన్న చోటికి దగ్గరలో ప్రేమ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోరా అనేసి అంటుంది. ప్రేమ చెప్పినట్లే ధీరజ్ ఒకచోట డ్రాఫ్ చేస్తాడు. అయితే ప్రేమ ధీరజ్ ఎంత అడుగుతున్నా సరే ఏమి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమ నడుచుకుంటూ ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిపోతుంది.
తిరుపతి బియ్యం బస్తాల గురించి లెక్కలు వేస్తూ ఉంటాడు. అలాగే తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక్కడైతే పెళ్లి కాదు ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనైతే నా పెళ్లి అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ముందు లెక్కలు రాయరా లేకపోతే డీ లెక్కలు తీస్తాను అని రామరాజు అంటాడు. వేదవతి నర్మదా ఇద్దరూ కళ్ళజోడు పెట్టుకొని సంతోషంతో ఎగురుతూ గంతులు వేస్తూ వస్తారు.. వాళ్లని చూసిన తిరుపతి దెయ్యం దెయ్యం అంటూ అరుస్తాడు.
కళ్ళజోడు తీసి ఏంట్రా నేను దెయ్యంలాగా నీకు కనిపిస్తున్నానా అని వేదవతి తిరుపతి చెంపలు వాయిస్తుంది. ఆడవాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఎంత తక్కువగా చేసి మాట్లాడుతున్నారు వంటింటి కుందేళ్లు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటో చెప్పు బుజ్జమ్మ అని రామరాజు అడుగుతాడు. దాంతో వేదవతి మన నర్మదకు ప్రమోషన్ వచ్చిందండి అని సంతోషంతో చెప్తుంది. అందరూ సంతోష్ పడుతూ నర్మదని పొగిడేస్తారు.
శ్రీవల్లి నర్మదని పొగడడంతో కుళ్ళుకుంటుంది. హాయ్ బాబోయ్ ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి ఇంతగా చేయాలని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక అప్పుడు అక్కడికి వచ్చిన భాగ్యం ఆనందరావు కూడా నర్మదని పొగిడినట్టే పొగిడి ఫిట్టింగ్ పెట్టేస్తారు. ఇక ప్రేమ కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. వచ్చి రాగానే కళ్యాణ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చి చితక్కొట్టేస్తుంది… కళ్యాణ్ తిరిగి ప్రేమను కట్టేసి అనుభవించాలి అనుకుంటాడు. . కానీ ధీరజ్ అక్కడకు వచ్చింది కొట్టేస్తాడు. కళ్యాణ్ ధీర నుంచి తప్పించుకొని పారిపోతాడు. ప్రేమను ధీరజ్ కాపాడతాడు..
Also Read : అక్షయ్ ను టార్గెట్ చేసిన బాస్.. రాజేంద్ర ప్రసాద్ పై సీరియస్.. పల్లవి ప్లాన్ తెలిసిపోతుందా..?
గదిలోకి వచ్చిన శ్రీవల్లి అక్కడున్న వస్తువులన్నీ పగలకొట్టేస్తుంది. అయితే అప్పుడే లోపలికి వచ్చిన ఆనందరావు భాగ్యం ఇద్దరు శ్రీవల్లిని ఆపుతారు. శ్రీవల్లి ఏం జరిగిందన్న విషయాన్ని చెప్తుంది. అయితే మా అత్తయ్య మామయ్య దగ్గర నాకు విలువలేదు మా ఆయన నన్ను దూరం పెట్టేసారని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక శ్రీవల్లి నన్ను పెద్ద కోడలుగా గుర్తించిన అంతసేపు లేదు నా కోరికలన్నీ నీళ్లు పోసిన దోశ పెనం లాగా ఆవిరి అయిపోయాయి అని బాధపడుతూ ఉంటుంది. శ్రీవల్లి చేతిలో పది లక్షలు పెడుతుంది భాగ్యం అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రేమని ధీరజ్ అడుగుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..