Bigg boss Agni Pariksha:మరో వారంలో తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారు అనే ఆతృత కూడా బిగ్ బాస్ లవర్స్ లో భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈసారి మిగతా సీజన్ లో లాగా కాకుండా డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకులలో సరికొత్త అంచనాలు పెంచడానికి పలు ప్రోమోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున (Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా ఈసారి ఈ సీజన్ కి మంచి టీఆర్పీ రేటింగ్ తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆకట్టుకుంటున్న అగ్నిపరీక్ష..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సీజన్ లో ఏకంగా ఐదు మంది సామాన్యులను హౌస్ లోకి పంపించబోతున్నారు. అందులో భాగంగానే సామాన్యుల నుంచి 20 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి.. దీన్ని బట్టి చూస్తే హౌస్ లోకి వెళ్ళాలనే ఆశ ఎంతమందికి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ 45 మందిని వివిధ రౌండ్ల ద్వారా సెలెక్ట్ చేసి.. వీరికి ఇప్పుడు అగ్నిపరీక్ష అంటూ ఒక షో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిందు మాధవి( Bindu Madhavi), నవదీప్(Navdeep ), అభిజిత్ (Abhijeet ) జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండగా.. శ్రీముఖి (Sreemukhi) హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
అగ్ని పరీక్ష పదవ ఎపిసోడ్ రెండవ ప్రోమో రిలీజ్..
ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష 10వ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా రెండవ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బ్రెయిన్ గేమ్ పెట్టి ఎవరు రియల్? ఎవరు ఫేక్? అనే విషయం ఐడెంటిఫై చేయాలి అని కంటెస్టెంట్స్ కి టాస్క్ విధించారు. టాస్క్ విషయానికి వస్తే.. మొదట ఇద్దరు వ్యక్తులను చూపించి ఇక్కడున్న వారిద్దరిలో రియల్ ఆర్ట్ స్కెచ్ ఎవరు అని శ్రీ ముఖి ప్రశ్నించింది. మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ ఎవరికి వారు తమ తెలివితేటలను ప్రదర్శించి రియల్ ఎవరు కనుక్కునే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే జడ్జ్ నవదీప్ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా మీలో తుత్తర మాత్రం ఆగలేదు. బిగ్ బాస్ చూడలేదా? అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు నవదీప్. ఇక ఈ బ్రెయిన్ టాస్క్ లో భాగంగా ఎవరికి వారు బాగానే పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లు అనిపించినా ఆఖరికి తమ తెలివితేటలను ప్రదర్శించడంలో ఫెయిల్ అయ్యారనేటట్టుగా ప్రోమోలో చూపించారు. మరిఏం జరిగింది అనే తెలియాలి అంటే జియో హాట్స్టార్ లో ప్రసారమవుతున్న పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
అంచనాలు పెంచుతున్న అగ్నిపరీక్ష..
ఇకపోతే తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న అగ్నిపరీక్ష మినీ షో మాత్రం బిగ్ బాస్ పై అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా ఇక్కడ రాటు తేలిన ఐదుగురు సభ్యులను హౌస్ లోకి పంపించబోతున్నారు. మరి ఆ ఐదుగురు ఎవరో? ఈ ఐదుగురు హౌస్ లోకి అడుగుపెడితే అక్కడ సిచువేషన్ ఎలా ఉండనుంది? సెలబ్రిటీలతో వీరు ఎలా పోటీ పడబోతున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే సెప్టెంబర్ 7న బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
also read:AgniPariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష పెద్ద మోసం… జడ్జ్ నవదీప్ పై రెచ్చిపోయిన కంటెస్టెంట్