BigTV English

AP Inter Exams: ఇంటర్‌ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు

AP Inter Exams: ఇంటర్‌ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు

AP Inter Exams: కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ప్రాథమిక నుంచి పీజీ వరకు రకరకాల మార్పులు చేసింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు బోర్డు ఓ ప్రణాళికను సిద్ధం చేసింది.


ఏపీలో ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు సర్కార్. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను పూర్తిగా అమలు చేసింది. ఒకప్పుడు విద్యార్థులు కేవలం ఎంపీసీ, బైపీసీ వంటి గ్రూపులు తీసుకునేవారు. ఇప్పుడు ఎంబైపీసీ తీసుకొచ్చింది. దీనివల్ల జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటు విద్యార్థులకు కల్పించారు.

కొందరు ఆర్ట్స్‌ విద్యార్థులు సైన్స్‌ సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు. అలాగే కొందరు సైన్స్‌ గ్రూపు విద్యార్థులు పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌ ఇలా దేనికైనా అర్హత సాధించవచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ప్రశ్నాపత్రాల విధానాన్ని మార్చింది బోర్డు.


ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను సంబంధించి 85 మార్కుల చొప్పున పేపర్ ఉంటుంది. మిగతా మార్కులు సెకండ్ ఇయర్‌లో ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. ఇదేకాకుండా కాంపిటేటివ్ బేస్ట్ ఎసెస్మెంట్ కోసం అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలు ఉండేలా కొత్తగా తీసుకొచ్చారు. బయాలజీలో వృక్షశాస్త్రం-43, జంతుశాస్త్రం-42 మార్కులకు పరీక్ష ఉండనుంది.

ALSO READ: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజీ

కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా పరీక్షా విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. నార్మల్‌గా ఇంటర్ పరీక్షలు మార్చిలో జరిగేవి. కానీ ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. ఒకప్పుడు మార్చిలో పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి సీబీఎస్‌ఈతోపాటు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే పరీక్షల విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

తొలుత సైన్స్‌ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు మొదలుకానున్నాయి. రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్ష ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉంటే ఆ రోజు బైపీసీ, ఆర్ట్స్‌ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఎంబైపీసీ గ్రూపును ప్రవేశపెట్టడంతో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ చదివే అవకాశం వచ్చింది.

దీనివల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఒక రోజు ఒక పరీక్ష విధానం తీసుకొచ్చింది. సైన్స్‌ గ్రూపు సబ్జెక్టులు పరీక్ష అయిన తర్వాత చివరిలో భాషలకు సంబంధించి ఎగ్జామ్ ఉండనుంది. ఆ తర్వాత ఆర్ట్స్‌ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి.

Related News

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Vijayawada Dasara 2025: దసరాకు ఎక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడికి రండి.. అసలు స్పెషల్ ఏంటంటే?

Stree Shakti Updates: స్త్రీ శక్తి స్కీమ్ అప్‌డేట్స్.. ఇకపై వాటిలో ఉచితంగా ప్రయాణం

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Pawan Kalyan: పవన్ ‘త్రిశూల’ వ్యూహాం.. ప్రత్యర్థులకు చుక్కలు ఖాయం

Big Stories

×