Bigg Boss Agnipariksha:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోగా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి ఊహించని విధంగా సరికొత్త టాస్కులతో ప్రేక్షకులను మెప్పించడానికి బిగ్బాస్ సిద్ధమవుతోంది.. ముఖ్యంగా సెలబ్రిటీలే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా ఏకంగా 5 మందిని తీసుకోబోతున్నట్లు సమాచారం.. ఇక అందులో భాగంగానే కామన్ మ్యాన్ కేటగిరీలో చాలా అప్లికేషన్స్ రాగా అందులో 100 మందిని బయటకు తీశారు.. ఆ వంద మందిలో టెస్టులు పెట్టి 40 మందిని బయటకు తీయగా.. ఆ 40 మందికి అగ్నిపరీక్ష అంటూ ఒక షో నిర్వహిస్తున్నారు.. ఇందులో 15 మందిని ఎంపిక చేసి.. ఆ పదహైదు మందిలో ఐదు మందిని హౌస్ లోకి పంపించడానికి సిద్ధమవుతున్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో రిలీజ్..
ఇకపోతే ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ బిందు మాధవి, నవదీప్ , అభిజీత్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుండగా .. ఆగస్టు 23వ తేదీన ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమం ప్రారంభం కానుంది . ఈ మేరకు షోపై హైప్ పెంచుతూ.. వరుస ప్రోలు వదులుతున్నారు.
లేటెస్ట్ ప్రోమో లో ఏముందంటే?
ఇక తాజాగా స్టార్ మా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమో విషయానికి వస్తే.. “బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం అంత సులభం కాదు.. అక్కడ నిలవాలన్నా.. గెలవాలన్నా.. ప్రజల అభిమానం తోడవ్వాలి..” అంటూ శ్రీముఖి హోస్టింగ్ తో ప్రోమో మొదలవుతుంది. బిగ్బాస్ కి వెళ్ళకముందే అభిమానుల నుంచి కొంత ఓట్ బ్యాంకు సొంతం చేసుకుంటారు. ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అంటూ బిందు మాధవి చెబుతుంది. ఈ ప్రోమోలో తేజ సజ్జ కూడా సందడి చేశారు.. ముఖ్యంగా కంటెస్టెంట్లు ఎవరికి వారు టాలెంట్ నిరూపించుకోవడానికి భిన్న విభిన్నమైన గెటప్స్ లో అలరించారు.. ఒక పెద్ద ఆవిడ ఏకంగా డాన్స్ చేస్తూ వచ్చి ఉపవాసం ఉంటా.. ఎంత కఠిన పరీక్ష పెట్టినా అనుభవిస్తాను.. కానీ ఎలిమినేట్ చేస్తే ఊరుకోను అంటూ తెలిపింది. ఆ తర్వాత మాస్క్ మాన్ వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హ్యాండీక్యాప్ వ్యక్తి కూడా హౌస్ లోకి అడుగు పెట్టడానికి సిద్ధమైపోయారు. ఆయన ధైర్యానికి అటు జడ్జెస్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అగ్నిపరీక్ష కార్యక్రమానికి భిన్నభిన్నమైన గెటప్స్ లో రకరకాల కామెంట్లతో సందడి చేస్తుండడంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ ఎక్కడి నుంచి వచ్చార్రా మీరంతా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
also read: F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?