BigTV English

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

F1 OTT: ఓటీటీల హవా పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు ఓటీటీ అంటేనే చాలామంది సైన్స్ ఫిక్షన్, హార్రర్, రొమాంటిక్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ లాంటి జానర్ సినిమాలను ఎక్కువగా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఓటేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం స్పోర్ట్స్ డ్రామా సినిమాలపై కూడా ఆసక్తి పెంచుకుంటున్నారనే చెప్పాలి.. దీనికి కారణం అప్పుడప్పుడు వస్తున్న ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి స్పోర్ట్స్ డ్రామా సినిమాలు. ఈ క్రమంలోనే మరో హాలీవుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.


ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన సూపర్ హిట్ మూవీ..

అసలు విషయంలోకి వెళ్తే.. కొన్నాళ్ల క్రితం థియేటర్లలో విడుదలైన ఒక హాలీవుడ్ మూవీ అటు ప్రపంచవ్యాప్త సినీ ప్రియులను అలరించింది. థియేటర్లలో విడుదలై దాదాపు నెలన్నర కావస్తున్నా.. ఇప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది అంటే ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి ప్రేక్షకుల నుండి ఆదరణ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇక ఆ చిత్రం ఏంటి? ఏ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రాబోతోంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


అమెజాన్ ప్రైమ్ లో..

హాలీవుడ్ చిత్రాలను ఎక్కువగా చూసే ప్రముఖ నటుడు బాడ్ ప్రిట్ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ఎఫ్ 1. ఇది కారు రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది. అటు తెలుగులో కూడా వచ్చిన ఈ సినిమా చూసి తెలుగు ఆడియన్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీలలో ఆగస్టు 22 నుండి అందుబాటులోకి రానుంది.. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మొత్తానికైతే స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఇటు ఓటీటీలో కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఎఫ్ 1 సినిమా స్టోరీ..

స్టోరీ విషయానికి వస్తే.. ఫార్ములా వన్ రైస్ లో డ్రైవర్గా అదరగొట్టిన బ్రాడ్ పిట్ కెరియర్ రిటైర్మెంట్ ఇచ్చి వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు.. అలాంటి ఈయనకు APXGP అని టీంలో రేసర్ గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలా రోజులు కావడంతో బ్రాడ్ పిట్ కి సమస్యలు ఎదురవుతాయి. తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ దూకుడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అనుభవాలు భరించడం చాలా కష్టంగా ఉంటాయి.. ఇక తర్వాత బ్రాడ్ పిట్ రేసింగ్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు? మళ్ళీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన బ్రాడ్ పిట్ కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

 

also read: Chhaava: సైలెంట్ గా టీవీల్లోకి రాబోతున్న రష్మిక ఛావా.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Related News

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Big Stories

×