Kangana Ranaut: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది కంగనా రనౌత్ (Kangana Ranaut).. అటు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ విమర్శలకు తావు ఇస్తున్న ఈమె.. ఇటు రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. బిజెపి తరఫున పోటీ చేసి మండి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన కంగనా రనౌత్.. తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో డేటింగ్ యాప్స్, సహజీవనం కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ప్రమోట్ అవుతుందని, దీనివల్ల నష్టం కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ సంచలన కామెంట్లు చేసింది కంగనా రనౌత్.
డేటింగ్ యాప్స్ పై మండిపడ్డ కంగనా..
ఈ మధ్యకాలంలో అటు రాజకీయ అంశాలపై ఇటు సినిమా అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. అందులో భాగంగానే సహజీవనం గురించి ప్రశ్న ఎదురవగా.. ఆమె ఊహించని కామెంట్లు చేసింది.. ఇదే ప్రశ్నకు కంగనా మాట్లాడుతూ..” ప్రస్తుతం మన దేశంలో లివ్ ఇన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అయితే ఇది పెరగడానికి కారణం డేటింగ్ యాప్స్ అని చెప్పాల. ఈ సహజీవనంలో మహిళలకు గర్భం వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సహజీవనంలో పెళ్లికి ముందే గర్భం ధరిస్తే సమాజం వీరిని యాక్సెప్ట్ చేస్తుందా? కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? ఒకవేళ అబార్షన్ చేయించాల్సి వస్తే ఎవరు చేయిస్తారు? లేదా పిల్లల్ని కనాలనుకుంటే వాళ్లను ఎవరు సంరక్షిస్తారు ? సహజీవనంలో గర్భం దాలిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా? అప్పటివరకు సహజీవనంలో ఉన్న అబ్బాయి గర్భం అని తెలిసిన వెంటనే వదిలేసి వెళ్లిపోడన్న గ్యారెంటీ ఏంటి? అంటూ ఇలా పలు ప్రశ్నలు సంధించింది కంగనా రనౌత్.
పెళ్లి బంధంతోనే అన్నీ సాధ్యం అంటూ..
ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఒకరికొకరు పెద్దగా పరిచయం లేకపోయినా.. పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమ మొదలవుతుంది. ఆ తర్వాత సహజీవనం అంటారు. ఎవరో తెలియని వ్యక్తితో సహజీవనం చేసి గర్భం పొందడం ఎంతవరకు కరెక్ట్.. ఒకవేళ వారే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధానికి రక్షణగా తల్లిదండ్రులు, బంధువులు నిలుస్తారు. ముఖ్యంగా సరైన నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు, సరైన సంబంధం వెతుక్కోవడం రాని వాళ్ళు ఇలా డేటింగ్ యాప్ల పైన ఆధారపడతారు. ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లలకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్వాతంత్రం కూడా ఉండాలి. అయితే ఆ ఆర్థిక స్వాతంత్రం అనేది ఇలా సహజీవనం కల్చర్ కోసం వాడడం ఎంతవరకు కరెక్టు? అంటూ కంగనా ప్రశ్నించింది.
కంగనా కామెంట్స్ కి అండగా నెటిజన్స్..
ప్రస్తుతం కంగనా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారినా.. ఆమె చేసిన కామెంట్లు నిజమని చాలామంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈ కల్చర్ వల్ల ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? దీనివల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఆడపిల్లల సంరక్షణపై కంగనా చేసిన కామెంట్లు ఇప్పుడు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు ఈ అంశాలు ఆలోచింపచేసేలా ఉన్నాయని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
also read:Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?