Bigg Boss AgniPariksha: ఆగస్టు 22వ తేదీన ‘అగ్నిపరీక్ష’ అంటూ ఐదు మంది సామాన్యులను ఎంపిక చేసి హౌస్ లోకి పంపించే క్రమంలో ఈ మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా ఈ మినీ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక 45 మంది కంటెస్టెంట్లను ఈ హౌస్ లోకి ఆహ్వానించి, వీరికి పలు రకాల టాస్కులు నిర్వహిస్తూ.. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా నెగ్గిన 5 మందిని హౌస్ లోకి పంపించబోతున్న విషయం తెలిసిందే.
చివరి దశకు చేరుకుంటున్న అగ్నిపరీక్ష..
అందులో భాగంగానే ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తి కాగా.. తాజాగా ఫేస్ ఫోర్ అంటూ ఒక ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో కంటెస్టెంట్స్ మధ్య పోటీని నెలకొల్పడమే కాకుండా వారు చేస్తున్న తప్పులు కూడా ప్రజలు పసిగట్టేలా చేసిందని చెప్పవచ్చు. ప్రోమో విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి మాట్లాడుతూ… “అగ్నిపరీక్ష చివరి దశకు చేరే కొద్దీ మా కంటెస్టెంట్స్ లో ఉన్న ప్రతి ఎమోషన్ బయటపడుతుంది. నేను గెలవాలి అన్న కసి అందరిలో కనిపిస్తుంది” అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.
చిత్ర విచిత్రమైన టాస్కులతో…
కంటెస్టెంట్స్ మధ్య రకరకాల టాస్కులను పెట్టినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఇకపోతే బంగాళదుంపల టాస్క్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ చేసిన పనికి.. నవదీప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పదేపదే ఎందుకలా చేస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. దాంతో ఆ కంటెస్టెంట్ కాస్త భయపడి వెనక్కి అడుగు వేసింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య పోటీ నెలకొనగా నేను బిగ్ బాస్ కి వచ్చింది అరగుండు కొట్టించుకోవడానికి కాదు అంటూ మరొక కంటెస్టెంట్ ను హేళన చేస్తూ మాట్లాడారు. ఇంకొంతమంది టాస్క్ ఆడకుండా ప్రాక్టీస్ చేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్లు ఎవరికి వారు ప్రవర్తించారు. మొత్తానికైతే కంటెస్టెంట్స్ మధ్య నెక్స్ట్ లెవెల్ లో జరగబోతున్న ఈ పోటీలో గెలిచేది ఎవరో అనే విషయం తెలియక అటు సామాన్య ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోమో చివర్లో జడ్జ్ అభిజిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలెట్ గా నిలిచింది. మొత్తానికి అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో ఇప్పుడు అగ్నిపరీక్ష పై ఉత్కంఠ పెంచుతోందని చెప్పవచ్చు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సర్వం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి స్టార్ మా వేదికగా ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna) ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఈసారి హౌస్ లోకి 5 మంది సామాన్యులు అడుగుపెట్టబోతున్నారు. మరొకవైపు 13 మందికి పైగా సెలబ్రిటీలను కంటెస్టెంట్ లుగా తీసుకోబోతున్నట్లు సమాచారం. అసలే వారం రోజులు కూడా లేని ఈ షోలో ఫైనల్ గా ఎవరు వెళ్లబోతున్నారు అనే విషయం ఉత్కంఠ గా మారింది.
also read:AA22xA6: దుఃఖాన్ని దిగమింగుకొని సెట్ లో పాల్గొన్న బన్నీ.. నీ డెడికేషన్ కి ఫిదా సామీ!