BigTV English

Anushka Shetty: ఇకనుంచి కనిపిస్తాను.. మాటచ్చిన జేజమ్మ

Anushka Shetty: ఇకనుంచి కనిపిస్తాను.. మాటచ్చిన జేజమ్మ

Anushka Shetty: గుడ్డి కన్నా మెల్ల మేలు అని ఒక సామెత ఉంటుంది. ప్రస్తుతం అనుష్క శెట్టి అభిమానులు ఈ సామెతను అన్వయించుకుంటున్నారు. ఎందుకు అంటే.. ప్రస్తుతం అనుష్క.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. అనుష్క మాత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనిపించడం లేదు. ఎందుకు అంటే.. స్వీటీ ప్రమోషన్స్ కు రావడం లేదని, ఆ ఒప్పందంతోనే సినిమా చేశామని నిర్మాత అంటే.. క్రిష్ ఏమో.. అది ఆమె వ్యక్తిగతం.. ఆమె పెర్ఫార్మెన్స్ చాలు.. ప్రమోషన్స్ అవసరం లేదు అని కవర్ చేశాడు.


ఇక ఏ సినిమాకు అయినా మెయిన్ హీరోహీరోయిన్ అనేవారు ప్రమోషన్స్ కు రావాలి. లేకపోతే ఆ సినిమాకు కచ్చితంగా అది మైనస్ అవుతుంది అని చెప్పొచ్చు. ఘాటీ విషయంలో కూడా స్వీటీ రాకపోతే అదే జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. కానీ, స్వీటీ ఏ కారణం చేతనో బయటకు రాను అని మొండిపట్టు పట్టుకు కూర్చుంది. మరి ఈ సమయంలో ఏం చేయాలి.. అటు స్వీటీ ప్రమోషన్స్ చేయాలి. అలా అని కెమెరా కంటికి కనిపించకూడదు. అలా రెండు బ్యాలెన్స్ చేయాలి అంటే కెమెరా కంటికి కనిపించకుండా ప్రమోషన్స్ చేయాలి. అది ఎలా అంటే.. ఆడియో ఇంటర్వూస్.

అవును.. అనుష్క ముఖం చూపించకుండా తన వాయిస్ ను వినిపిస్తుంది. ఆడియో ఇంటర్వ్యూల ద్వారా అభిమానులకు దగ్గర అవుతుంది. తాజాగా  హీరో రానాతో కలిసి స్వీటీ ఒక ఆడియో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఫోన్ లో రానా అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చింది. చాలాకాలం తరువాత స్వీటీ వాయిస్ విన్న అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. ఇక అనుష్క – రానా మధ్య స్నేహం ఎలాంటిదో అందరికీ తెల్సిందే. బాహుబలి దగ్గరనుంచి వీరు మంచి ఫ్రెండ్స్ గా మారారు.


ఇక ఈ ఆడియో ఇంటర్వ్యూలో అనుష్క.. ఘాటీ గురించిన ఎన్నో విషయాలను పంచుకుంది. బాహుబలి, అరుంధతి, భాగమతి తరువాత నాకు ఘాటీనే. నేనొక హిట్ విమెన్ గా మారిపోయాను. వైలెన్స్ అది పక్కన పెడితే ఇలాంటి కథ ప్రస్తుత సమాజానికి చాలా అవసరమని నాకు అనిపించింది. క్రిష్ గారు నాకు యూనిక్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వేదంలో సరోజ కానీ, ఘాటీలో షీలా కానీ.. చాలా యూనిక్ ఉంటాయి. ఈ రెండు క్యారెక్టర్స్ నా కెరీర్ లోనే బెస్ట్. ఇక ఈ ఏడాది చివరి నుంచి నా నుంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఎందుకు నువ్వు కనిపించవు అని అడుగుతున్నారు.. ఇక నుంచి కనిపిస్తాను అని అనుష్క చెప్పుకొచ్చింది.

ఇక ఇది ఒక్కటే కాకుండా రేడియోలో కూడా స్వీటీ తన గొంతును వినిపించబోతుంది. ఏదైతే ఏమి.. స్వీటీ కనిపించకపోయినా.. వినిపిస్తుంది కదా అది చాలు అంటూ అభిమానులు ఆనందపడుతున్నారు. మరి స్వీటీ ఆడియో ప్రమోషన్స్ ఘాటీ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Ram Gopal Varma Tweet : పోలీసులకే భయం వేస్తే ఎక్కడికి వెళ్తారు… ఆర్జీవీ ట్వీట్ వైరల్

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం బాలీవుడ్ ఎంట్రీ… ఏకంగా మీర్జాపూర్ డైరెక్టర్‌తో ?

Venkatesh: వెంకటేష్ ఇంట్లో విషాదం… 12 సంవత్సరాలుగా కలిసి ఉన్న స్నేహితుడు దూరం

Anushka Shetty Ghaati: హమ్మయ్య ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనుష్క.. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది

Allu Arjun: దుఃఖాన్ని దిగమింగుకొని సెట్ లో పాల్గొన్న బన్నీ.. నీ డెడికేషన్ కి ఫిదా సామీ!

Big Stories

×