Allu Arjun:అల్లు అర్జున్ (Allu Arjun).. పేరు కాదు బ్రాండ్ అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు కూడా.. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అండతో ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగిన ఈయన.. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తన చిత్రాలతో నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.. ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
అల్లు అర్జున్ ఇంట్లో విషాదం..
ఇలాంటి సమయంలో గత రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనక రత్నమ్మ (Allu Kanakaratnamma) స్వర్గస్తులయ్యారు. 94 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు. వాస్తవానికి ఒకే ఇంట్లో ఉన్న కారణంగా అల్లు అర్జున్ కి తన నానమ్మతో మంచి సాన్నిహిత్యం ఉండేదట.. నానమ్మ మరణించారు అని తెలిసిన వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేసుకొని మరీ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకున్న బన్నీ దగ్గరుండి మరీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. నానమ్మ పాడే మోసి ఆమెతో ఉన్న జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు.
బాధను దిగమింగుకొని షూటింగ్ కి హాజరైన బన్నీ..
ఆగస్టు 30వ తేదీ మధ్యాహ్న అల్లు కనక రత్నమ్మ అంత్యక్రియలు ముగిసాయి. ఇక నిన్నటి వరకు అల్లు కుటుంబాన్ని చాలామంది సినీ సెలబ్రిటీలు, బంధువులు వచ్చి పరామర్శించారు.. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. ఇంత దుఃఖంలో కూడా బన్నీ షూటింగ్ కి హాజరు కావడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. బన్నీ తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రెండు రోజుల క్రితం తన ఇంట్లో విషాదం జరిగింది. ఆ విషాదాన్ని ఆయన దిగమింగుకొని మరీ సెట్ పైన ఉన్న #AA22 సినిమా షూటింగ్ కి ఎటువంటి అంతరాయం కలగకూడదు అని వెంటనే షూటింగ్ కి హాజరు కావడం ఆయన నిబద్ధతకు నిదర్శనం అని చెప్పవచ్చు.
బన్నీ డెడికేషన్ పై నిర్మాత ఎస్కేఎన్ ట్వీట్..
ఇకపోతే ఈ విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.”అల్లు అర్జున్ డెడికేషన్ కి, కమిట్మెంట్ కి ప్రొఫెషన్ కి ఆయన ఇచ్చే వ్యాల్యూకి మేమంతా ఫిదా అవుతున్నాము. ఇంట్లో జరిగిన ఇంత పెద్ద విషాదాన్ని ఆయన దిగమింగుకొని.. తన వల్ల సెట్ మీద ఉన్న చిత్రానికి ఇబ్బంది కలగకూడదని వెంటనే షూటింగ్ కు హాజరయ్యారు.. దీన్ని బట్టి చూస్తే ఆయన నిబద్ధత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు” అంటూ ఎస్కేఎన్ ట్వీట్ పెట్టారు.. ఐదుచూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంత దుఃఖంలో కూడా మళ్లీ తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదు అని బన్నీ చేసిన ఈ పని అందరి చేత ప్రశంసల కురిపించేలా చేస్తోంది.
AA22xA6 సినిమా విశేషాలు..
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. రష్మిక మందన్న, మృనాల్ ఠాగూర్, జాన్వి కపూర్ వంటి వారు కూడా నటిస్తున్నట్లు సమాచారం.
also read: Nara Brahmani: అఖండ 2 మీ వల్లే ఆలస్యం.. తమన్ పై బ్రాహ్మణి ఊహించని కామెంట్స్!
.@alluarjun gari dedication and commitment towards profession is truly admiring & inspiring
రెండు రోజుల క్రితం ఇంట్లో జరిగిన విషాదాన్ని దిగమింగుకొని తన వల్ల సెట్స్ మీద ఉన్న #AA22 కు ఎటువంటి అంతరాయం కలుగకూడదు అని వెంటనే షూటింగ్ కి హాజరు కావటం అయన నిబద్దత కి నిదర్శనం pic.twitter.com/t18H2vZ9T1— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 1, 2025