Sara Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండుల్కర్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమె బాలీవుడ్ నటి కాకపోయినప్పటికీ ఆమె అందానికి అభిమానులు ఫిదా అవుతుంటారు. సారా టెండుల్కర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె తరచూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది. అయితే సారా టెండూల్కర్ – టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
గతంలో వీరిద్దరి వ్యవహార శైలి కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. దీంతో గతంలో సారా పేరు ప్రస్తావించకుండా గిల్.. తనకు ఎవరితో ఎలాంటి రిలేషన్ లేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయినప్పటికీ వీరిద్దరి డేటింగ్ కి సంబంధించిన వార్తలు ఆగలేదు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం, లేట్ నైట్ పార్టీలకు హాజరు కావడం, ఆ మధ్య యువరాజ్ సింగ్ నిర్వహించిన చారిటీ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతోపాటు సారా, తోటి ఆటగాళ్లతో గిల్ హాజరు కావడం, అక్కడ జరిగిన ఓ సంఘటన కారణంగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున పుకార్లు వెలువడ్డాయి.
కానీ గిల్ ప్రస్తుతం తన కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి.. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ఇక తాజాగా టీ-20 వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే ఇటీవల సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె సానియా చందోక్ తో అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అయితే అర్జున్ తన అక్క సారా టెండుల్కర్ కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు.
సారా టెండూల్కర్ వయసు 27 కాగా.. అర్జున్ వయసు 25 సంవత్సరాలు. సాధారణంగా భారతీయ సాంప్రదాయంలో ముందు పెద్ద వారికి పెళ్లి జరుగుతుంది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన కూతురు కంటే ముందు కుమారుడి నిశ్చితార్థం ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది. దీంతో అభిమానులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సారా టెండుల్కర్ తాజాగా ఓ యువకుడితో క్లోజ్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Rahul Dravid Quits: రాజస్థాన్ నుంచి ద్రవిడ్ అవుట్… రంగంలోకి బ్రెట్ లీ ?
దీంతో సారా ఆ యువకుడితో రిలేషన్ లో ఉందన్న వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఆ యువకుడు ఎవరన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే ఈ రూమర్స్ పై సారా స్పష్టత ఇస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి. ఇక సారా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మెడిసిన్ చదువుతుంది. అయితే తన చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట సారా.