Bigg Boss : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటుల జీవితాలు పూల పాన్పు మాత్రం కాదు.. కష్టాలను అధిగమించి, ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని వరుసగా సినిమాలు చేస్తున్నారు.. కొంతమంది చావు అంచుల వరకు వెళ్లి ప్రస్తుతం సినిమాలు సీరియల్స్లలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు కంటెస్టెంట్స్ బుల్లితెరపై వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటే, మరికొందరు యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ గలాట గీతూ ఒకరు. ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గలాటా గీతూ.. అలియాస్ గీతు రాయల్. ఈమె గురించి ఈమధ్య ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. గీతూ రాయల్ తాజాగా చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. తన జీవితంలో ఎదురైనా అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఆమె చెప్పుకొచ్చింది.. ఆరుసార్లు చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చినట్లు గీతు రాయల్ బయట పెట్టింది.. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం అమ్మ.. ఆ చేసిన పుణ్యమే నన్ను ప్రాణాలతో బయటపడేలా చేసింది అని గీతు ఎమోషనల్ అయింది..
Also Read : ప్రాణాలతో బయటపడ్డ రామరాజు.. అమూల్యను కొట్టిన విశ్వం.. అయ్యో ఇరుక్కున్న వల్లి..
యూట్యూబ్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు గా మారిన సంగతి తెలిసిందే. వాళ్ళు చేసే వీడియోలు వాళ్ళ జీవితాలని పూర్తిగా మార్చేశాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఎంతోమంది యూట్యూబ్ ద్వారా బాగా సంపాదించడంతో పాటు పాపులారిటిని దక్కించుకున్నారు. అలాంటి వారిలో గీతు రాయల్ ఒకరు. బిగ్ బాస్ రివ్యూవర్గా తన కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.. బిగ్ బాస్ తెలుగు 7లో ‘బిగ్ బాస్ బజ్’ షోకు యాంకర్‌గా కూడా వ్యవహరించింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా ఉన్న ఈ అమ్మడు టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న ప్రత్యేక షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది. అలాగే ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. అంతే కాదు పలు సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ ఈమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది..