BigTV English

Bigg Boss: హిమాలయాల బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే విరక్తి పుట్టిందా..?

Bigg Boss: హిమాలయాల బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే విరక్తి పుట్టిందా..?

Bigg Boss: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రెటీలు చేసే ఏ పనైనా సరే ఇట్టే వైరల్ అవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా అభిమానులకు చేరువలో ఉండడానికి తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి, వృత్తి పరమైన విషయాల గురించి.. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు రకాల పనులు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక బిగ్ బాస్ (Bigg Boss) బ్యూటీ ఏకంగా హిమాలయాల బాట పట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ విషయాన్ని చెప్పడంతో అప్పుడే జీవితంపై విరక్తి పుట్టిందా అని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఆమె ఎవరు..? ఎందుకు హిమాలయాలకు బయలుదేరింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.


హిమాలయాల బాట పట్టిన యాంకర్ విష్ణు ప్రియ..

ఆమె ఎవరో కాదు ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ (Vishnu Priya). ‘పోవే పోరా’ షో ద్వారా ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు షోలలో హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ (Manas) తో వీడియో ఆల్బమ్స్ చేసి మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొనింది. ఈమెకు ఉన్న క్రేజ్ ను బట్టి అందరూ టైటిల్ విజేత అవుతుందని అనుకున్నారు. కానీ తోటి కంటెస్టెంట్ పృథ్విరాజ్ శెట్టితో ఈమె నడిపిన ప్రేమాయణం ఈమె గుర్తింపును తగ్గించిందనే చెప్పాలి. అతనికి ఇష్టం లేకపోయినా అతడిని ప్రేమిస్తున్నాను అంటూ అతడి వెంటపడింది. అంతేకాదు గేమ్స్ లో కూడా అతడి కోసం శాక్రిఫైజ్ చేసి ఓడిపోయింది. అలా అభిమానులను సైతం మెప్పించ లేకపోయింది.దాంతో మధ్యలోనే ఇంటికి వచ్చేసింది.


ఇకపై కొన్ని రోజులు అదే నా ఇల్లు అంటున్న విష్ణు ప్రియ..

హౌస్ నుంచీ బయటకు వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కున్న ఈమె ఇటీవలే మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో..”కొద్ది రోజులు హిమాలయాల్లోనే ఉండాలనుకుంటున్నాను.. ఇకపై కొన్ని రోజుల వరకూ హిమాలయాలే నా ఇల్లు ” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి విష్ణుప్రియ శివ భక్తురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఆధ్యాత్మికతవైపు ఆమె అడుగులు వేస్తూ ఉంటుంది. పైగా ఎండాకాలం ప్రారంభం అయింది. మండే ఎండలు తట్టుకోలేక ఎండలు పూర్తిగా తగ్గేవరకు హిమాలయాల్లోనే ఉంటూ అక్కడే ఆధ్యాత్మిక సేవ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇప్పుడు హిమాలయాలకు వెళ్లడం ఖాయమని తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు ఏంటి కొంపతీసి అప్పుడే జీవితంపై విరక్తి పుట్టిందా? హిమాలయాలు అంటున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా విష్ణు ప్రియా పెట్టిన ఇంస్టాగ్రామ్ స్టేటస్ మాత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Naa Anveshana: లేడీ అఘోరీపై సంచలన వీడియో చేసిన అన్వేష్.. ఆ మాటలేంటి అన్వేష్..!

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×