Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana Anvesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రపంచ యాత్రికుడిగా, యూట్యూబర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన, గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత కీలకంగా మారిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబర్స్ ను మొదలుకొని పాన్ ఇండియా స్టార్స్ వరకు ఎవరిని వదలడం లేదు. ఇక అంతటితో ఆగకుండా వారి పుట్టుపూర్వత్రాలను సైతం బయటికి తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు ట్రెండింగ్ టాపిక్ గా నిలిచిన ప్రతి అంశంపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న అన్వేష్.. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వారిపై విమర్శలు గుప్పించిన ఈయన , నిన్నటికి నిన్న అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై కూడా స్పందించారు. తాజాగా లేడీ అఘోరీ పెళ్లి చేసుకోవడంపై కూడా సంచలన వీడియో రిలీజ్ చేశారు.
లేడీ అఘోరీపై సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్..
అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆ వీడియోలో ఇలా మాట్లాడాడు అన్వేష్.. లేడీ అఘోరి అంటూ చెప్పుకుంటున్న వాడు.. ఆడా కాదు.. మాడా కాదు.. వాడు మగాడే. తన ప్రైవేట్ పార్ట్ కి ఆరోగ్య సమస్య రావడంతో సర్జరీ చేయించుకొని లేడీ అఘోరీ వేషం వేశాడు. డబ్బులు అక్రమంగా సంపాదించుకునేందుకు ఇలా హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ మతం పేరిట తెలుగు ప్రజలను మోసం చేస్తూ బాగా పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా వీడు చాలా మంది మహిళలతో ఆడుకున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి అంటూ అన్వేష్ కామెంట్ చేశారు.
అత్యంత క్రూరుడు అంటూ..
ఇక ఇతగాడి పెళ్ళంటారా..? ఇతడు శ్రీ వర్షిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు . లేడీ అఘోరి శ్రీనివాస్ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ డబ్బుని చూసి శ్రీ వర్షిని కూడా అతడిని పెళ్లి చేసుకుంది. అంటూ ఆమె బండారం కూడా బయటపెట్టారు అన్వేష్. అంతేకాదు లేడీ అఘోరీ గా చెప్పుకుంటున్న శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ పెట్టి బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారని, కాబట్టి ఎవరూ కూడా ఇతడిని నమ్మవద్దు అంటూ పలు ఆరోపణలు గుప్పించారు అన్వేష్. ఇక అంతే కాదు ఈ లేడీ అఘోరీ శ్రీనివాస్ గురించి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. కానీ ఇప్పుడు చెప్పలేను. మొత్తానికి అయితే వీడికి మగతనం ఉంది.. కానీ ముళ్ళు మాత్రం లేదు అంటూ కామెంట్లు చేశారు. అందుకే మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నాడు అంటూ కూడా ఆరోపణలు గుప్పించడం జరిగింది. ప్రస్తుతం అన్వేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై లేడీ అఘోరీగా చెప్పకుంటున్న శ్రీనివాస్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక ప్రస్తుతం అన్వేష్ చేసిన ఈ కామెంట్లు అందరినీ ఆలోచింపచేస్తున్నాయని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Rowdy Janardhan: రౌడీ హీరో కోసం రంగంలోకి దిగిన ఫేమస్ కెమెరా మెన్.. ఎవరంటే..?